తెలుగు ప్రేక్షకులను పలు చిత్రాలతో పలకరించిన దుల్కర్ సల్మాన్ ఆమద్య ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించిన దుల్కర్ ప్రస్తుతం హిందీలో నటిస్తున్నాడు. ఇప్పటికే హిందీలో ఈయన కార్వాన్ అనే చిత్రంలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం దుల్కర్ హిందీలో సోనమ్ కపూర్ తో కలిసి ‘ది జోయా ఫ్యాక్టరీ’ అనే సినిమాను చేస్తున్నాడు.
వీరిద్దరు తాజాగా షూటింగ్ సమయంలో సరదాగా చేసిన పని ఏకంగా పోలీసులు ఎంటర్ అయ్యే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... సోనమ్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో దుల్కర్ సల్మాన్ కారు డ్రైవ్ చేస్తూ స్టీరింగ్ వదిలేసి, ఫోన్ చూస్తూ, కనీసం సీటు బెల్టు కూడా పెట్టుకోకుండా ఉన్నాడు. సోనమ్ కపూర్ ఆ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే పోలీసులు ఆమె ట్వీట్ కు సమాధానంగా ఇలాంటి ఫీట్ లు రియల్ లైఫ్ లో అస్సలు పద్దతి కాదు, డ్రైవింగ్ సమయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ముంబయి పోలీసులు దుల్కర్ ను సున్నితంగా హెచ్చరించారు.
ముంబయి పోలీసుల రంగ ప్రవేశంతో వెంటనే స్పందించిన దుల్కర్ సల్మాన్ ఆ సమయంలో తాను కారు డ్రైవ్ చేయడం లేదని, షూటింగ్ లో భాగంగా తమ కారును ఒక ట్రక్ లాక్కు వెళ్తుందని అప్పుడు తామిద్దరం అందులో కూర్చున్నామని చెప్పుకొచ్చాడు. ముందు వైపుకు తిప్పి చూపకుండా సోనమ్ వీడియో పోస్ట్ చేయడంతో అంతా కూడా దుల్కర్ డ్రైవ్ లో ఉన్నాడని అనుకుంటారు. అయిదు దుల్కర్ పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం ట్రక్ కారును లాక్కెలుతున్నట్లుగా క్లీయర్ గా ఉంది. మొత్తానికి ముంబయి పోలీసులు చాలా అలర్ట్ గా ఉండటంను జనాలు అభినందిస్తున్నారు.