సారీ జాహ్న‌వి అనేసిన సోనమ్

Update: 2018-05-08 11:13 GMT

సోన‌మ్ క‌పూర్ త‌న పెళ్లి వేడుక‌లో చెల్లెలు వర‌స‌య్యే శ్రీదేవి పెద్ద కూతురుని ఆట ప‌ట్టించింది. అదే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ‌వుతోంది. జాహ్న‌వి పెళ్లి విష‌యంలో సోన‌మ్ కాసేపు ఆమెను కంగారు పెట్టించింది. త‌రువాత సారీ చెప్పి వ‌దిలేసింది. సోన‌మ్ చేసిన ప‌నికి జాహ్న‌వి కాసేపు నిజంగానే కంగారు ప‌డింది. ఇంత‌కీ సోన‌మ్ ఏం చేసింది?

సోన‌మ్ క‌పూర్ మెహెందీ వేడుక సంగీత్  సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సిక్కు సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి కూతురికి ఎర్ర‌ని గాజులు చేతికి వేస్తారు. అలాగే చేతికి క‌లిరే అనే సాంప్ర‌దాయ అనే సాంప్ర‌దాయ ఆభ‌ర‌ణాల‌ను చేతికి క‌డ‌తారు. అవి చిరుగంట‌ల్లా చేతుల నుంచి కింద‌కి వేలాడ‌తాయి. వాటిని పెళ్లి కూతురు ఎవ‌రికి తాకిస్తే వారికి తన త‌రువాత వెంట‌నే పెళ్లి అవుతుంద‌ని న‌మ్మ‌కం. సోన‌మ్ త‌న చెల్లెలు వ‌ర‌స‌య్యే జాహ్న‌విని క‌లేరీతో తాకుతున్న‌ట్టు ఆట‌పెట్టించింది. ఎక్క‌డ త‌న‌ను క‌లేరీ తాకుతుందో అని జాహ్న‌వి భ‌య‌ప‌డింది. చివ‌రికి తాక‌కుండానే వ‌దిలేసింది సోన‌మ్‌. జాహ్న‌వి హ‌మ్మ‌య్య అని వెళ్లిపోతుంటే సారీ చెప్పింది పెళ్లికూతురు. ఇదంతా పెళ్లికి వ‌చ్చిన అతిధులు ఫోనులో చిత్రీక‌రించారు. అది ఇప్పుడు వైర‌ల్ అయింది.

సోన‌మ్ పెళ్లి ఆమె ప్రియులు ఆనంద్ ఆహుజాతో ఈ రోజు మ‌ధ్యాహ్నం ఘ‌నంగా జ‌రిగింది. ముంబైలోని బాంద్రాలోని పెద్ద బంగ్లాలో ఈ పెళ్లి జ‌రిగింది. కొంద‌రు బాలీవుడ్ ప్ర‌ముఖ‌లు క‌పూర్ కుటుంబం మ‌ధ్య‌లో గులాబీ రంగు పూల మండ‌పం కింద సోన‌మ్ - ఆనంద్ ఒక్క‌ట‌య్యారు. శ్రీదేవి కూతుళ్లు జాహ్న‌వి ఖుషీ పెళ్లిలో న‌వ్వుతూ తుళ్లుతూ క‌నిపించారు. సోన‌మ్ త‌రువాత వారే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News