అబ్బా ఎంత సన్నబడిపోయిందో

Update: 2017-05-24 15:56 GMT
హిందీ సీరియల్స్ లో పార్వతీదేవిగా ప్రేక్షకులను మెప్పించిన సోనారికా భడోరియా.. మనకు మాత్రం గ్లామర్ హీరోయిన్ గానే పరిచయం అయింది. సీరియల్స్ కాకుండా ఇప్పటివరకూ ఈ భామ నటించిన సినిమాల లిస్ట్ చూస్తే.. తెలుగు సినిమాలే ఎక్కువగా ఉంటాయి.

జాదూగాడుతో ప్రారంభించి.. స్పీడున్నోడు.. ఈడో రకం ఆడో రకం చిత్రాల్లో కనిపించిన సోనారిక.. నిజానికి కాసింత బొద్దుగానే కనిపిస్తుంది. కానీ.. ఇప్పుడీ భామ సడెన్ గా ఛేంజ్ చూపించేసింది. భలే సన్నగా నాజుగ్గా మారిపోయింది. బాలీవుడ్ అవకాశాల కోసం భారీగానే ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ.. ఆ ఇండస్ట్రీ ఏ తరహాలో అందాలను కోరుకుంటుందో అలా మారిపోయింది. తాజాగా తన మేని సొగసులను ఏ తరహాగా మార్చుకుందో చూపిస్తూ.. ఓ ఫోటో షూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది ఈ బ్యూటీ.

కొంతకాలంగా పెద్దగా సోషల్ మీడియాలో కనిపించకపోవడంపై రియాక్ట్ అయింది సోనారిక. 'ఇలా మాయమైపోయినందుకు సంజాయిషీ ఇచ్చేయాలని నేనేమీ అనుకోవడం లేదు. లైఫ్ లో ప్రతీ ఫేజ్ లోనూ ఏదో ఒక అకాశం వస్తుంది. ఈ కాసింత సమయంలో అది మాత్రమే చేయగలం. మన సమయాన్నీ ఏదీ నిర్ణయించలేదు' అంటూ కాసింత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది సోనారికా భడోరియా.


Tags:    

Similar News