ప్ర‌భాస్ విల‌న్ గా బెబో.. మ‌రి హీరోయిన్ గా?

Update: 2021-11-09 14:32 GMT
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ వేడి పెంచిన సంగ‌తి తెలిసిందే. ఆదిపురుష్ 3డి- స‌లార్ చిత్రాల్ని సైమ‌ల్టేనియ‌స్ గా పూర్తి చేస్తున్నాడు. మ‌రోవైపు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రానికి స‌న్నాహ‌కాలు సాగుతున్నాయి.

అయితే ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స్పిరిట్ ని జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యంత భారీగా తెర‌కెక్కించి విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారించ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతోంది. ఈ చిత్రాన్ని చైనీస్- కొరియన్ - జపనీస్ భాషలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాస్టింగ్ ఎంపిక‌లు చేస్తుండ‌డం మ‌రో స‌ర్ ప్రైజ్. ముఖ్యంగా కొరియ‌న్ మార్కెట్ చైనీస్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే అక్క‌డ స్థానికంగా పాపులారిటీ ఉన్న ఒక క‌థానాయికను ఫైట‌ర్ల‌ను ఎంపిక చేయాల‌నేది సందీప్ రెడ్డి వంగా ఆలోచ‌న. అందుకు త‌గ్గ‌ట్టే ఇప్పుడు కొరియ‌న్ భామ‌ను బ‌రిలో దించుతున్నార‌ని తెలిసింది.

తాజా స‌మాచారం మేర‌కు.. స్పిరిట్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సాంగ్ హై క్యో అనే కొరియన్ నటిని ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. హై-క్యో ఆటం ఇన్ మై హార్ట్- ఆల్ ఇన్ ఆల్- ఫుల్ హౌస్ స‌హా ఇతర టెలివిజన్ డ్రామాలతో ప్రపంచ ప్రజాదరణ పొందిన న‌టి హైక్యో. ఈ న‌టి అంగీక‌రిస్తే కొరియన్ మార్కెట్ కి అది పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని అంచ‌నా. ప్రస్తుతానికి ఇవ‌న్నీ సోషల్ మీడియా ఊహాగానాలు మాత్ర‌మే. నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌తిదీ వెల్ల‌డించాల్సి ఉంటుంది.

మ‌రోవైపు ఈ చిత్రంలో బెబో క‌రీనా క‌పూర్ న‌టిస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. క‌రీనా ఇందులో అత‌డికి క‌థానాయిక‌గా న‌టిస్తుందా లేక ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒప్పించారా? అన్న‌ది తేలాల్సి ఉంది. స్పిరిట్ సందీప్ రెడ్డి వంగా మార్క్ సీరియ‌స్ డ్రామాతో తెర‌కెక్క‌నుందిట‌. సలార్ - ప్రాజెక్ట్ కె చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌య్యాక మొద‌ల‌వుతుంది. అప్ప‌టికి ప్రీప్రొడ‌క్ష‌న్ పనులు కాస్టింగ్ ఎంపిక‌లు పూర్తి చేస్తారు.
Tags:    

Similar News