కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు.. విద్యార్థులు.. ఫ్రంట్ లైన్ కార్మికులు.. రోగులకు చేసిన సహాయంతో నటుడు సోను సూద్ రియల్ హీరో అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలిచారు.
ఇటీవల పంజాబ్ స్టేట్ ఐకాన్ గా నియమితుడైన సోనూ సూద్ ఇప్పుడు మరో కొత్త ఘనతను సాధించారు. ట్విట్టర్ ఫాలోయింగ్ కి సంబంధించినంతవరకు సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్, ...అక్షయ్ కుమార్ లను సోను అధిగమించారు. ఈ క్రైసిస్ సవాల్ సమయాల్లో కష్టాల్లో ఉన్న అవసరార్థులను చేరుకోవడానికి ఆదుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తెరిచిన పరోపకారిగా అగ్రస్థానంలో నిలిపారు.
సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ (ట్విట్టీట్) వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్విట్టర్ లో సోనూ సూద్ నంబర్ 1గా నిలిచారు. అక్టోబర్ నెలలో తమ అనలిటిక్స్ నివేదికలో అన్ని వర్గాలలో నాలుగో స్థానంలో సోనూ ఉన్నారని వెల్లడైంది. రాజకీయాలు- జర్నలిజం- వ్యాపారం- పెట్టుబడి- క్రీడలు- చలనచిత్రం- పుస్తక రచన- పాక కళ - కామెడీ రంగాలలోని ప్రముఖ వ్యక్తుల కోసం ట్విట్టర్ ఎంగేజ్ మెంట్లను ట్విట్టీట్ విశ్లేషించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ తరువాత రాహుల్ గాంధీ.. విరాట్ కోహ్లీ.. సోను సూద్ ఉన్నారు.
బాలీవుడ్ జాబితాలో 2.4 మిలియన్ ఎంగేజ్ మెంట్ లతో సోనూ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత షారూక్ ఖాన్,.. అక్షయ్ కుమార్.., అనుపమ్ ఖేర్.., రితీష్ దేశ్ ముఖ్..., పూజా హెగ్డే ఉన్నారు.
`ఐ యామ్ నో మెస్సీయ` పేరుతో తన ఆత్మకథను ప్రారంభించటానికి ఎదురుచూస్తున్న సోనుకి ఇది బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. కష్టకాలంలో సోనూ సేవలకు గొప్ప గుర్తింపు దక్కింది. అతని అభిమానులు.. తోటివారు .. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన చేసిన సహాయక చర్యలను ప్రశంసించారు. అవసరమైన వారికి సహాయం చేయటానికి పెద్ద హృదయం అవసరమని ఆయన నిరూపించారు.