సేవా కార్యక్రమాల్లో సరికొత్త తరహాను ప్రదర్శించి దేశ వ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానుతున్న సినీ నటుడు సోనూసూద్ కు గడిచిన మూడు రోజులుగా రోటీన్ కు భిన్నమైన వార్తల్లో ఆయన పేరు నలుగుతోంది. ఆయనకు చెందిన సేవా సంస్థలు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి.. రెండు రోజుల్లో ఆయన ఆర్థిక అవకతవకలు కొద్దిమేర ఉన్నా.. తాజాగా మాత్రం భారీగా ఉన్నాయని.. సుమారు రూ.250 కోట్ల మేరకు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన చేసే సేవా కార్యక్రమాల ఇమేజ్ ను దెబ్బ తీసేలా వస్తున్న వార్తలు ఒక వైపు.. పంజాబ్ పొలిటికల్ ఎపిసోడ్ లో భాగంగానే సోనూసూద్ ను బద్నాం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
చాలా అరుదుగా మాత్రమే ప్రెస్ నోట్లు విడుదల చేసే ఐటీ శాఖ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. అందులోని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం చూస్తే.. సోనూసూద్ ఆయన భాగస్వాములు కలిపి రూ.20 కోట్లకు పైగా పన్నుని ఎగవేసినట్లుగా తాము గుర్తించినట్లుగా ఐటీ శాఖ చెబుతోంది.
గడిచిన మూడు రోజులుగా ముంబయితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో.. ఆయన నివాసంలో.. ఆయన భాగస్వామ్యుల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బయటకు వచ్చిన వివరాల ప్రకారం రూ.20 కోట్లకు పైగా ఆదాయపన్ను ఎగ్గొట్టినట్లుగా ఐటీ శాఖ పేర్కొంటోంది. దీని ప్రకారం ఆదాయపన్ను శాఖ ఏం చెబుతోందంటే..
- సోనూసూద్ లెక్కల్లో చూపించని ఆదాయాన్ని ఎన్నో బోగస్ సంస్థల నుంచి తనఖాలేని రుణాల రూపంలో తీసుకున్నారు. ఈ నిధులతో పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి చేశారు.
- సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ దాతల నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2.1 కోట్లు సేకరించారు.
- కరోనా మొదటి వేవ్ వేళ.. సూద్ ఛారిటీ ఫౌండేషన్ కు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.18.94 కోట్ల విరాళాలు అందగా.. వాటిల్లో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వెచ్చించారు.మిగిలిన డబ్బంతా ఆ ఖాతాలోనే ఉంది.
- సోనూసూద్‌కు చెందిన కంపెనీ ఇటీవల లక్నోకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని సంయుక్తంగా ప్రాజెక్టులు మొదలు పెట్టింది. ఇప్పుడు ఐటీ శాఖ ఆ ఒప్పందాలు, ప్రాజెక్టులపై దృష్టి సారించింది.
- క్నో సంస్థ బోగస్ బిల్లులు, సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఆ రీతిలో రూ.65 కోట్లకు పైగా నిధులు బోగస్ కంపెనీలకు దారి మళ్లాయి. సోదాల వేళ సోనూసూద్ వద్ద నుంచి రూ.1.8కోట్లు స్వాధీనం చేసుకున్నాం.