టాలీవుడ్.. బాలీవుడ్ ల్లో విలన్ గా స్టార్ డం ను దక్కించుకున్న సోనూసూద్ కరోనా కారణంగా వేలాది మందికి రియల్ హీరో అయ్యాడు. లక్షల మంది సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కోసం ప్రత్యేక బస్సులు.. విమానం ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. దాదాపుగా 30 వేలకు పైగా వసల కార్మికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడంలో సోనూసూద్ కీలకంగా వ్యవహరించారు.
సోనూసూద్ సేవలను దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. ఆయన సాయం పొందిన వారు ఆయనో దేవుడు అంటూ పూజిస్తున్నారు. వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్ మరోసారి వారికి అండగా నిలిచేందుకు సిద్దం అయ్యాడు. వలస కూలీలు వారి వారి ప్రాంతాలకు కాలి నడకన వెళ్తున్న సమయంలో పలు సంఘటనల్లో మృతి చెందారు. దాదాపుగా 400 మంది వలస కార్మికులు మృత్యువాతపడ్డారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు.
ఆ నాలుగు వందల మందికి సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు వారికి కావాల్సిన అవసరాలను కూడా తెలుసుకుంటున్నారు. వారికి ఆర్థిక సాయంతో పాటు పలు అవసరాలను గుర్తించి సాయం చేసేందుకు సోనూసూద్ భారీగా ఖర్చు చేయబోతున్నాడట. కుటుంబంకు ఆరు నెలలకు సరిపడ గ్రాసరీస్ ను అందించేందుకు సోనూసూద్ ఆర్థిక వనరులు రెడీ చేస్తున్నాడట. మొత్తానికి మరోసారి సోనూసూద్ చేస్తున్న పని జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంటుంది.