నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో సోనూసూద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అతడు - అరుంధతి - అశోక్ - దూకుడు .. ఒకటేమిటి టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ విలన్ అయ్యాడు. అదిరిపోయే మజిల్స్ తో విలన్ అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేశాడు. సోనూసూద్ బాలీవుడ్ లోనూ పాపులర్ విలన్. అయితే అతడు బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన హ్యాపీ న్యూయర్ సినిమాలో నటించాక చాలా కాలంగా ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. అయితే సోనూ ఏమయ్యాడు? అన్న సందేహం వచ్చింది అందరికీ.. కట్ చేస్తే హాలీవుడ్ లో తేలాడు.
సోనూసూద్ ఇప్పుడు హాలీవుడ్ హీరో. అతడు జాకీచాన్ హీరోగా నటిస్తున్న కుంగ్ ఫూ యోగా అనే చిత్రంలో జాకీచాన్ కి సమాంతరంగా లీడ్ రోల్ లో చేస్తున్నాడు. స్టాన్‌లీ టాంగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే బీజింగ్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఓవైపు అమెరికన్ టెలీ సీరియల్ క్వాంటికోతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దుమ్ము దులిపేస్తోంది. సీఐఏ ఏజెంట్ గా రిస్కీ స్టంట్స్ చేస్తూ అదరగొట్టేస్తోంది. ఇప్పుడు సోనూసూద్ లాంటి విలన్ ఏకంగా జకీచాన్ సినిమాలో జాకీతో పాటు సినిమా మొత్తం కనిపించే రోల్ లో చేస్తున్నాడు. ఇది ఇండియన్స్ అంతా గర్వించదగ్గ విషయం. ఈ సినిమా తో సోనూకి హాలీవుడ్ లోనూ పాపులారిటీ పెరిగిపోవడం ఖాయం. జాకీచాన్ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా కుంగ్ ఫూ యోగా పేరు మార్మోగిపోతోంది. అందులో సోనూ యాక్షన్ చూడడానికి రెండు కళ్లు చాలవేమో!