ఇంటికొచ్చిన వారి సమస్యలు తీర్చిన సోను సూద్

Update: 2021-05-24 01:30 GMT
కరోనా లాక్ డౌన్ లో సోనూ సూద్ చేసిన సేవ అంతా ఇంతాకాదు. ఎంతో మందిని ఆదుకొని దేశవ్యాప్తంగా రియల్ హీరోగా మారాడు. ఇప్పటికీ సాయం చేస్తూ తన ఉదారత చాటుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వాలు చేయలేని పనిని కూడా సోనూ సూద్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు సమస్యల కోసం ప్రజలు ప్రభుత్వాల వైపు చూడడం లేదు. సోనూ సూద్ నే ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ముంబైలోని సోనూ సూద్ నివాసానికి కరోనా రోగుల బాధితులు కొందరు వచ్చారు. తన ఇంటిబయట ఎదురుచూస్తున్న వారిని చూసి సోనూ సూద్ బయటకు వచ్చి మరీ వారి బాధలు విన్నారు.

బాధితులు తమకు సాయం చేయమని సోనూ సూద్ కాళ్ల వేళ్లా పడగా.. సోనూ వారించి తప్పకుండా సాయం చేస్తానని బాధితులకు అభయం ఇచ్చాడు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవలే దేశవ్యాప్తంగా సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించాడు.
ఆసుపత్రులలో స్థాపించబోయే మొదటి ఆక్సిజన్ ప్లాంట్లను నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఆస్పత్రితోపాటు.. కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయతలపెట్టారు. అవసరమైన వారికి ఆసుపత్రి పడకలను అందిస్తున్నాడు. అందరికీ సహాయపడుతూ సోను సూద్ సెకండ్ వేవ్ లో మరింత సాయాన్ని అందిస్తున్నారు..

తాజాగా కరోనా మహమ్మారి బాధితులుగా మారిన కొందరు తన నివాసం వెలుపల గుమిగూడిన వ్యక్తులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాడు. ఈ నటుడు ప్రజల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు.




Tags:    

Similar News