సినిమా పరిశ్రమపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మొదట థియేటర్లు బంద్ అయ్యాయి.. ఆ తర్వాత షూటింగ్స్ నిలిచి పోయాయి.. ప్రస్తుతం స్టార్స్ అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి స్వీయ గృహ నిర్భందంలో ఉంటూ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్లాలని అనుకోవద్దంటూ స్టార్స్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. ఈసమయంలోనే తాము లాక్ డౌన్ ఫ్రీ టైంను ఎలా స్పెండ్ చేస్తున్నామనే విషయాలను ఫొటోలు ఇంకా వీడియోల రూపంలో తెలియజేస్తున్నారు.
ఈ సమయంలో కొందరు స్టార్స్ వంట చేస్తుంటే మరికొందరు ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే మరికొందరు పూర్తిగా పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తున్నారు. ఈ సమయంలోనే విలన్ గా.. నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్ కూడా తన లాక్ డౌన్ టైంను ఎలా గడుపుతున్న విషయాన్ని ఈ ఫొటో రూపంలో తెలియజేశాడు.
కొడుకు ఇషాంత్ సూద్ తో కలిసి కండలు పెంచే పనిలో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ మెయింటెన్ చేసే సోనూ సూద్ తన కొడుకుతో కూడా ఈ టైంలో ఎక్కువ శాతం వర్కౌట్స్ చేయిస్తున్నాడట. ఇషాంత్ సూద్ కూడా కండలు పెంచి కాబోయే హీరో అనిపించుకుంటున్నాడు. ఇషాంత్ జిమ్ బాడీని చూస్తుంటే అతి త్వరలోనే హీరోగా వస్తాడేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ తండ్రి కొడుకుల బాడీ బిల్డింగ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.