ఫోటో స్టోరీ: రాయల్ సోఫాపై రాకింగ్ పోజు

Update: 2019-10-17 04:04 GMT
బాలీవుడ్ లో ఇంటర్నేషనల్ హాటుభామల లిస్టులో సోఫీ చౌదరి కూడా ఒకరు. ఈభామ ఇండియన్ మూలాలు ఉన్న బ్రిటిష్ సిటిజెన్.  బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.  మహేష్ బాబు '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు తనదైన శైలిలో గ్లామర్ అద్దింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హీటు పెంచుతూ వీలైనంత హంగామా చేస్తున్న భామ కావడంతో నెటిజన్లకు కూడా ఈ భామ హాటు ఫేవరెట్టే.

రీసెంట్ గా ఈ భామ ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఫుల్ గా ఎంబ్రాయిడరీ ఉండే డిజైనర్ ఛోళి.. లెహెంగా ధరించి.. దానికి తగ్గ ఆభరణాలతో ఓ రాయల్ లుక్ ఉండే సోఫా లో కూర్చుని ఫోటోకు పోజిచ్చింది.  మెడలో నెక్లెస్ చాలా అందంగా ఉంది.. ఒక చేతికి ఉన్నరిస్ట్ బ్యాండ్ కూడా డ్రెస్ కు మ్యాచ్ అయింది.  అయితే ఇవన్నీ హైలైట్లు ఎలా అవుతాయి?  ఈ ఫోటోలో హైలైట్ ఏంటో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి. సహజంగా టీవీ క్విజ్జులలో ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలే కదా అడుగుతారు.  అయితే హాజరైన వారందరూ ఎంతో తెలివైనవారు కావడంతో చకచకా సమాధానాలు చెప్పి పకపకా నవ్వుతారు.  క్లిష్ట..మైన ప్రశ్నలు కదా!

ఇలాంటి కళాత్మకమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? ఫోటో షూట్ చేసి అందుబాటులో ఉంచితే చాలు.. ఇక నెటిజన్లు లైక్స్ తో షేర్లతో  అల్లుకుపోతారు.  ఈ ఫోటోకు కూడా అలాంటి లక్షణాలు ఫుల్లుగా ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సోఫీ బిజినెస్ ఫుల్లు డల్లు.. నో ఆఫర్లు!



Tags:    

Similar News