ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` ఫీవర్ ఎక్కడా తగ్గడం లేదు. సినిమా విడుదలై నెల రోజులు దాటుతున్నా బన్నీ మేనియా ఎక్కడా తగ్గేదే లే అంటోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ, సుకుమార్ ల కలయికలో వచ్చిన ఈ మూడవ చిత్రం ఈ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందని బన్నీతో పాటు దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా అంచనా వేయలేకపోయారు. ఈ మూవీ ఏకంగా ఉత్తరాదిలో 85 కోట్లని వసూలు చేసి ట్రేడ్ వర్గాలతో పాటు `పుష్ప` టీమ్ ని కూడా విస్మయానికి గురిచేసింది.
ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ఓన్ చేసుకున్న పలువురు క్రేజీ స్టార్ లు ఈ మూవీలోని పాటలకు `పుష్ప` సిగ్నేచర్ స్టెప్స్ వేస్తూ ఆ వీడియోలని నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో గ్లోబల్ వైడ్ గా `పుష్ప` భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. వసూళ్ల పరంగానే కాకుండా సాంగ్స్ రీ క్రియేషన్ పరంగా నూ ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఏ సినిమాకు కూడా సెలబ్రిటీలు ఈ రేంజ్ లో ప్రచారం చేయలేదు. ఆ పరంగా `పుష్ప` సరికొత్త రికార్డుని సృష్టించినట్టే అంటున్నారు ఫిల్మ్ వర్గాలు.
దక్షిణాదితో పోలిస్తే ఈ మూవీకి ఉత్తరాదిలో `పుష్ప` హిందీ వెర్షన్ కు మేకర్స్ ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు. ఆ భాధ్యతని హిందీ హక్కులు సొంతం చూఏసుకున్న వారికే వదిలేశారు. వారు కూడా ఎలాంటి ప్రచారం చేయకపోయినా ఈ మూవీకి స్టార్ క్రికెటర్లు ప్రచార కర్తలుగా మారడం విశేషం. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇండియన్ క్రికెటర్స్ సురేష్ రైనా, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, హార్థిక్ పాండ్యా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రావో ఈ మూవీ కి ప్రచార కర్తలుగా మారారు.
ఈ చిత్రంలోని శ్రీవల్లి సాంగ్ తో పాటు పుష్ప డైలాగ్ ని రీక్రియేట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ సోఫియా చౌదరి చేరింది. నెట్టింట హాట్ హాట్ ఫొటో షూట్ లతో సందడి చేసే సోఫియా చౌదరి `పుష్ప` కోసం సమంత చేసిన `ఊ అంటావా మావ ఊహూ అంటావా..` ఐటమ్ సాంగ్ ని ఆలపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోకి ఆసక్తికరమైన పోస్ట్ ని కూడా జత చేసింది.
`ఊ అంటావా మావ ఊహూ అంటావా పాటని ప్రయత్నిస్తానని ప్రామిస్ చేశాను కాబట్టి ఇదిగో. అంటూ తను పాడిన వీడియోని అభిమానులతో పంచుకుంది సోఫియా చౌదరి. అంతే కాకుండా ప్లీజ్ తప్పులు వుంటే క్షమించండి అబ్బాయిలు.. ఇదొక ఎపిక్ సాంగ్. దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్,సమంత అలాగే ఈ పాట పాడిన ఇంద్రావతి ఈ పాటని ఓ రేంజ్ లో ఊపేశారు` అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోఫియా చౌదరి షేర్ చేసిన `ఊ అంటావా మావ ఊహూ అంటావా..` నెట్టింట వైరల్ గా మారింది. సోఫియా చౌదరి పక్కా ప్రొఫెషనల్‌సింగర్ లా ఒరిజినల్ సింగర్ ఇంద్రావతిని మరిపించేసింది.
https://twitter.com/sophie_choudry/status/1486591161078743043?s=24