విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో `భారతీయుడు` తెరకెక్కి ఇప్పటికే రెండు దశాబ్ధాలు అవుతున్న సంగతి తెలసిందే. ఇంతకాలానికి ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది. `భారతీయుడు 2` ఈనెల 18 నుంచి సెట్స్ పైకి వెళుతోంది. రామోజీ ఫిలింసిటీ - చెన్నయ్ - కొరియా - బ్యాంకాక్ - థైవాన్ లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో ఈ సినిమాని తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. 2.0 తర్వాత లైకా ప్రొడక్షన్స్ సంస్థ మరోసారి ఏమాత్రం రాజీకి రాకుండా పెట్టుబడులు వెదజల్లనుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో కథానాయికగా అందాల చందమామ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ కొన్ని పోరాట దృశ్యాల్లోనూ నటించనుంది. తన పాత్ర కోసం అవసరం మేర కళరియపట్టు (కేరళ) విద్యను కాజల్ నేర్చుకుందని ప్రచారమైంది. ఇకపోతే ఇదే చిత్రంలో కొరియా నటి బేయ్ సుజి కూడా కీలక పాత్ర పోషించనుందని తాజాగా రివీలైంది. బేయ్ సుజీ కొరియాలో ఫేమస్ స్టార్. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. ఈ అమ్మడి యాక్షన్ - అందచందాలు సినిమాకి పెద్ద అస్సెట్ కానున్నాయని శంకర్ బృందం భావిస్తున్నారట.
ఇక 2.0 చిత్రాన్ని 3డి - 2డిలో రిలీజ్ చేసిన శంకర్ `భారతీయుడు 2` చిత్రాన్ని కేవలం 2డిలో మాత్రమే తెరకెక్కించడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కంటెంట్ ప్రకారం `భారతీయుడు 2` చిత్రానికి 2డి వెర్షన్ సరిపోతుందని శంకర్ భావించారట. భారతీయుడు 2 రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఆస్కారం ఉన్నా - 2.0 రేంజులో అవసరం లేదని తెలుస్తోంది.
Full View