పేద సంగీత కళాకారుల కోసం వచ్చి మృత్యువు ఒడిలో చేరిన బాలు

Update: 2020-09-25 17:30 GMT
గాన గంధర్వుడు తన పాటను అమితంగా ఇష్టపడే జనాల వద్ద తన పాటలను వదిలేసి గందర్వ లోకం వెళ్లి పోయారు. ఆయన నిన్న మొన్నటి వరకు బాగానే ఉండి పాటలు పాడినట్లుగా టీవీల్లో పాటుల సోషల్‌ మీడియాలో వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది. ఆయన చేసిన ఎన్నో స్టేజ్‌ షో లు కొన్ని వందలు వేల మందికి జీవితాన్ని జీవన ఆధారాన్ని ఇచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరగా ఆయన పాల్గొన్న సంగీత కార్యక్రమం కూడా కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న సంగీత కళాకారుల కోసం నిర్వహించిందే. ప్రముఖ తెలుగు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుండి హైదరాబాద్‌ వచ్చిన బాల సుబ్రమణ్యం ఆ కార్యక్రమ సమయంలో కరోనా బారిన పడ్డారు. ఎవరి నుండి ఆ వైరస్‌ ఆయనకు అంటింది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ కార్యక్రమం సందర్బంగానే అంటింది అనేది ప్రతి ఒక్కరి మాట.

కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి ప్రయాణాలు మరియు కార్యక్రమాలు వద్దంటూ ఆయన సతీమణి సావిత్రి గారు వద్దని వారించారట. పేద సంగీత కళాకారుల సహాయార్థం నిర్వహిస్తున్న కార్యక్రమం అవ్వడంతో బాలు గారు ఆగలేక పోయారు. డబ్బుల కోసం అయితే ఆయన వచ్చే వారు కారేమో. కళాకారుల సహాయం అంటూ కార్యక్రమ నిర్వాహకులు చెప్పడంతో మనసు ఉండబట్టుకోలేక ఆయన హైదరాబాద్‌ వచ్చారు. మూడు రోజులు హైదరాబాద్‌ లో ఉన్న ఆయన చెన్నై వెళ్లిన మూడు నాలుగు రోజులకే కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. కరోనా నుండి బయట పడి ఆయన ఖచ్చితంగా మళ్లీ సంగీత కచేరీలు చేస్తాడు అనుకుంటే మళ్లీ హైదరాబాద్‌ మొహం చూడుకుండా తిరిగిరాని లోకాలకు బాలు గారు వెళ్లి పోయారు.
Tags:    

Similar News