ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనాతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం మొదట నార్మల్ గానే ఉన్న రోజులు గడిచిన కొద్ది ఆయన ఆరోగ్యం విషమించి ఐసీయూకు తరలించారు. అప్పటి నుండి అభిమానుల్లో ఆందోల మొదలైంది. బాలు ఆరోగ్యం విషయంలో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు బాలు తనయుడు ఎస్పీ చరణ్ వీడియో ద్వారా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం చేస్తున్నాడు. ఆసుపత్రి వర్గాల వారు కూడా హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు.
బాలు గారి ఆరోగ్యంపై చరణ్ నిన్న స్పందిస్తూ నాన్న ఆరోగ్యం నిన్న చెప్పనట్లుగా మెరుగు పడుతుంది. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న వారు వాటిని కంటిన్యూ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ సమయంలోనే డాక్టర్ లకు ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తన తండ్రి మెల్లగా కోలుకుంటున్నాడు. అతి త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి బయటకు వస్తాడనే నమ్మకంను ఎస్పీ చరణ్ వ్యక్తం చేస్తున్నాడు. శ్వాస తీసుకోవడం లో ఇంకా కాస్త ఇబ్బంది పడుతున్న బాలుకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారు. అయితే వైధ్యులను కుటుంబ సభ్యులను బాలు గుర్తు పడుతున్నారట.