నెల రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం మొదట చాలా నార్మల్ గానే ఉన్నా కొన్ని రోజుల్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది ఐసీయూకి తరలించినట్లుగా వైధ్యులు ప్రకటించారు. అప్పటి నుండి అందరిలో ఆందోళన మొదలయ్యింది. అసలే కరోనా ఆయన ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ అంటున్నారు. దాంతో ఆయన ఆరోగ్యం విషయం పై దేవుళ్లకు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. దాదాపు రెండు వారాల టెన్షన్ తర్వాత బాలు తనయుడు చరణ్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఎట్టకేలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి కరోనా నెగటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఎస్పీ చరణ్ ప్రకటించారు. నాన్న కు కరోనా నెగటివ్ రావడం సంతోషంగా ఉంది. అయితే ఆయన ఇంకా కూడా వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల వెంటిలేటర్ తొలగించడం సాధ్యం అవ్వడం లేదు. త్వరలోనే ఆయన సాదారణ స్థితికి వస్తారని ఆశిస్తున్నాం. నాన్న తన ఐపాడ్ లో క్రికెట్ మరియు టెన్నీస్ చూశారు. ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక పెళ్లి రోజును కూడా హుషారుగా నాన్న చేసుకున్నారు. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ చరణ్ పేర్కొన్నాడు.