గ్యారేజ్ కోసం కొత్త టీములు దిగుతున్నాయ్

Update: 2016-08-22 07:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ విడుదలకు మరో పది రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ప్రమోషన్స్ ను పట్టాలెక్కించనున్నారు మేకర్స్. ఈ మూవీతో ఎన్టీఆర్ తన రియల్ సత్తా చాటుతాడని అభిమానులు ఆశలు పెట్టుకుంటే.. ఫ్యాన్స్ కోరిక తీర్చడానికి యంగ్ టైగర్ కొత్త ఎత్తులు వేస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అందరికంటే ముందు స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నా.. ఎన్టీఆర్ ఇంకా బిగ్ లీగ్ లోకి చేరలేదు. టెంపర్ మూవీతో 40 కోట్లను అందుకున్న ఈ స్టార్.. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంతో 50 కోట్ల మార్కును అధిగమించాడు. ఈ గ్రోత్ రేట్ ని ఇంకా స్పీడ్ గా పరుగులు పెట్టించడం కోసం.. ఇప్పుడు స్పెషల్ పీఆర్ టీములు రంగంలోకి దిగుతున్నాయని తెలుస్తోంది. ఈ సారి ఎన్టీఆర్ టార్గెట్ కనీసం 70 కోట్ల వసూళ్లు అంటున్నారు.

ఇవాల్టి రోజుల్లో మొదటి వీకెండ్ లో ఎంత ఎక్కువ ఓపెనింగ్స్ వస్తే.. ఆ ఫిగర్ ఫైనల్ ట్యాలీలో లెక్కలను విపరీతంగా మార్చేస్తుంది. అందుకే జనతా గ్యారేజ్ కు హైప్ పెంచడం కోసం రకరకాల ప్లానింగ్స్ తో రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. అటు మీడియా హౌజ్ లు... ఇటు వెబ్ పోర్టల్స్.. ఇలా వేటినీ వదలకుండా ప్రచారాన్ని పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లనున్నారు. మరి ఈ కొత్త టీముల హంగామా అంతా సక్సెస్ అయిపోయి.. ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తే.. అంతకంటే ఫ్యాన్స్ పెద్దగా ఆశించేదేముంటుంది.

Tags:    

Similar News