యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన "విక్రమ్" సినిమా ఇటీవలే విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమాలోని ప్రతీ అంశం కూడా ఎంతో ఎగ్జైట్ చేస్తోంది.
'విక్రమ్' సినిమాలో జైలు ఫైట్ జరుగుతున్నప్పుడు బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. మూవీ విడుదలైనప్పటి నుండి ఈ వింటేజ్ పాట ట్రెండింగ్ లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ పాటని కంపోజ్ చేసారని చాలామంది భావించారు. కానీ ఇది పాత తమిళ చిత్రంలోని గీతం అని కొందరికి మాత్రమే తెలుసు.
అయితే లేటెస్టుగా సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ 'విక్రమ్' సినిమాలో ఉపయోగించిన 'చక్కు చక్కు వాతికుచి' పాట గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా 1995లో 'అసురన్' సినిమాలోని ఈ పెప్పీ పాట బ్యాక్ స్టోరీని వెల్లడించారు హరీష్.
"మిస్టర్ ఆదిత్యన్ స్వరపరిచి, నాచే ప్రోగ్రామ్ చేయబడిన ఈ వింటేజ్ పెప్పీ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పాట VGP స్టూడియోలో 1995లో రికార్డ్ చేయబడింది" అని హరీష్ జైరాజ్ ట్వీట్ చేస్తూ.. వీడియో సాంగ్ ని షేర్ చేశారు.
అరుణ్ పాండ్యన్ - రోజా - నెపోలియన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అసురన్'. హాలీవుడ్ మూవీ 'ప్రిడేటర్' ఆధారంగా రోజా భర్త ఆర్కే సెల్వమని ఈ సినిమాకి కథ అందించి నిర్మించారు. ఇది తెలుగులోనూ డబ్బింగ్ కాబడి.. ఇప్పటికే బుల్లితెర మీద ప్రసారం అవుతూనే ఉంది.
'విక్రమ్' సినిమా కోసం 'చక్కు చక్కు' పాటను ఉపయోగించడంతో.. ఇప్పుడు పాత 'అసురన్' సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సాంగ్ రైట్స్ తీసుకునే సినిమాలో వాడుకున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి లోకేశ్ కనగరాజ్ కు సంగీతంలో మంచి అభిరుచి ఉందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలానే దివంగత సంగీత దర్శకుడు ఆదిత్యన్ ను ఇదొక నివాళి అని అంటున్నారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఇందులో భాగమైన హరీష్ జయరాజ్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన హరీష్.. 'స్పైడర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు నితిన్ 32వ చిత్రంతో నేరుగా తెలుగులోకి వస్తున్నారు.