జేమ్స్ బాండ్ 007 ఫ్రాంఛైజీలో ఇప్పటికే 25 సినిమాలు వచ్చాయి. 'నోటైమ్ టు డై' అనేది ఈ సిరీస్ లో 25వ సినిమా. ఇప్పుడు బాండ్ సిరీస్ లో 26వ చిత్రం సెట్స్ పై ఉంది. అయితే ఇన్నేళ్లకు టాలీవుడ్ లో స్పై ఆపరేషన్ పై పూర్తి స్థాయిలో మనసు మళ్లింది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గూఢచారిగా నటించినా .. దానిని మహేష్ అనుసరించినా కానీ మోడ్రన్ ఏజ్ హీరోల్లో అడివి శేష్ గూఢచారి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి కొత్త దారి చూపించాడు.
ఆ తర్వాత అతడిని అనుసరిస్తూ కొందరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏజెంట్ .. స్పై .. ఇంటెలిజెన్స్.. ఎన్ ఐఏ అధికారి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ గూఢచర్యం నేపథ్యంలోనివేననేది తెలిసిందే. అడివి శేష్ ని కార్తికేయ అనుసరించాడు. అతడు ఎన్.ఐ.ఏ అధికారిగా కనిపించాడు.
ఇప్పుడు దీనిని అక్కినేని కాంపౌండ్ అనుసరిస్తోంది. అక్కినేని చియాన్ అఖిల్ ప్రస్తుతం స్పై ఏజెంట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ దూసుకెళుతోంది. నాగార్జున ది ఘోస్ట్ లో క్రూరమైన కిల్లర్ ఏజెంట్ గా నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని కాంపౌండ్ లో గూఢచర్యం ఫీవర్ ఒక రేంజులో రాజుకుందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తాజా సమాచారం మేరకు ఇది మెగా కాంపౌండ్ కి పాకింది. అక్కడ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గూఢచారిగా నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ తో PSV గరుడవేగ - నాగార్జునతో 'ది ఘోస్ట్' చిత్రాల సారథిగా గూఢచారి కాన్సెప్టుల్లో నిపుణుడిగా మారిన ప్రవీణ్ సత్తారు తదుపరి వరుణ్ తేజ్ కోసం గూఢచర్యం నేపథ్యంలోనే స్క్రిప్టును రెడీ చేశారన్న గుసగుసా వినిపిస్తోంది. నిజానికి మెగా క్యాంప్ హీరో ఏజెంట్ పాత్రలో నటించడం కూడా అదే తొలిసారి అవుతుంది.
అక్కినేని కోడలుగా ఉన్నప్పుడే సమంత ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో నటించారు. గూఢచర్యం ఎన్.ఐ.ఏ అధికారుల కాన్సెప్టుతో రూపొందిన ఈ సిరీస్ లో సామ్ తీవ్రవాది పాత్రతో మెప్పించారు. ఫ్యామిలీమ్యాన్ ఘనవిజయం నేపథ్యంలో స్పెషల్ ఓపీఎస్ కూడా గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కి ఆకట్టుకుంది. ఇటీవల కంగన నటించిన ధాకడ్ కూడా స్పై ఏజెంట్ కథతోనే వచ్చింది.
బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా 'టైగర్' సిరీస్ స్పై ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కుతూ సంచలన వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. షారూక్ పఠాన్.. హృతిక్ ఫైటర్ ఈ తరహానే. మునుముందు బాలీవుడ్ టాలీవుడ్ లో స్పై కాన్సెప్టులు మరింత వెల్లువలా రానున్నాయనడానికి ఇది సంకేతం. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర బ్యానర్లలో స్పై ఏజెంట్ కథలకు మరింత బలం చేకూరనుండడం అగ్ర హీరోలు దీనికి ప్రోత్సాహకంగా నిలవడం కూడా ఈ జానర్ కి మరింత ఊతం కానుంది.