తెలుగు తెరపై మళ్లీ స్పైల హల్ చల్ మొదలైంది. ఈ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో స్టార్ హీరోల నుంచి క్రేజీ హీరోల వరకు స్పై థ్రిల్లర్ ల వైపు దృష్టిపెడుతున్నారు. ఇప్పటి వరకు యాక్షన్ ఎంటర్ టైనర్స్, ఫ్యామిలీ మూవీస్, రొమాంటిక్ యాక్షన్ ఫిలింస్ ని చేసిన హీరోలంతా ఇప్పుడు కొత్త జానర్ ని ఎంచుకుంటున్నారు. కొంత మంది సక్సెస్ కోసం.. స్టార్ ఇమేజ్ ని దక్కించుకోవాలన్న ఆలోచలో భాగంగా కూడా ఈ తరహా స్పై థ్రిల్లర్ లకు మొగ్గుచూపుతున్నారు.
ఈ తరహా ఫార్ములా చిత్రాల పరంపర ప్రస్తుతం దక్షిణాదిలో ఎక్కువవుతోంది. హాలీవుడ్ మాత్రమే అత్యధికంగా ఫాలో అవుతున్న స్పై థ్రిల్లర్స్ ఫార్ములా ఇప్పడు తెలుగులోనూ ప్రముఖంగా మారింది. గతంలో ఈ జోనర్ లో వచ్చిన చిత్రాలు భారీ విజయాల్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. అయినా సరే మన వాళ్లు ఈ జోనర్ పై మనసు పారేసుకోవడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ జోనర్ లో రూపొందిన చిత్రాలు కొన్ని బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. కొన్ని భారీ డిజాస్టర్ అయ్యాయి.
లోకనాయకుడు, విలక్షణ హీరో కమల్ హాసన్ ఈ ఫార్ములా చిత్రాలకు ఔత్ లో నాంది పలికారు. ఆయన నటించిన వివాదాస్పద చిత్రం 'విశ్వరూపం'. గత కొన్నేళ్ల క్రితం 'ద్రోహి' మూవీతో ఈ తరహా చిత్రాలని మొదలుపెట్టిన కమల్ హాసన్ అదే ఫార్ములాతో విశ్వరూపం, విశ్వరూపం -2' ని రూపొందించి నటించారు. ఈ రెండు చిత్రాలు వివాదాస్పదం కావడమే కాకుండా దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీశాయి. ఒక దశలో ఈ సినిమాల కారణంగా కమల్ దేశం వదిలి వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కూడా.
ఈ సిరీస్ చిత్రాల తరువాత డా. రాజశేఖర్ ఇదే ఫార్ములాతో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 'పీఎస్ వీ గరుడ వేగ' చిత్రాన్ని చేశారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీ డా. రాజశేఖర్ కెరీర్ కి నూతన జవసత్వాల్ని అందించింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రాజశేఖర్ ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఆ తరువాత యంగ్ హీరో అడివి శేష్ ఇదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. పరిమిత బడ్జెట్ లో అడివి శేష్ చేసిన చిత్రం 'గూఢచారి'. ఈ మూవీ కూడా స్పైథ్రిల్లరే. అనూహ్య విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ ని చేస్తున్నారు. అందులోనూ అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక వీరి తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ జానర్ ని ట్రైచేశారు. ఆయన నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'స్పైడర్'. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చూసి ఈ జోనర్ తనకు అచ్చిరాదని నిరూపించింది. స్టార్ ఇమేజ్ లేని హీరోలు ట్రై చేసిన ఈ జోనర్ వారికి బ్లాక్ బస్టర్ హిట్ లని అందించిన ఆశ్చర్యపరిస్తే స్టార్ ఇమేజ్ వున్న మహేష్ ట్రై చేస్తే మాత్రం దారుణంగా షాకివ్వడం విశేషం.
ప్రస్తుతం ఈ స్పై జానర్ లో రెండు క్రేజీ చిత్రాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే ఒకటి షూటింగ్ పూర్తయి రిలీజ్ కు రెడీ అయింది కూడా. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించారు. భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నారు. ఇక ఇదే తరహా ఫార్ములాతో అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' చిత్రం రూపొందుతోంది.
స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుంకర రామబ్రహ్మంతో కలిసి సరెండర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నారు. కొంత మందికి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన స్పై థ్రిల్లర్ జానర్ మన వాళ్లకు వర్కవుట్ అవుతుందా? అన్నది తెలియాలంటే 'బీస్ట్' రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.