చైల్డ్ సైకో భలే క్లిక్ అయ్యాడు

Update: 2017-10-04 04:33 GMT
దర్శకుడు కథ రాసుకున్నప్పుడు ఆ కథకి చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవసరమైతే ఆ సీన్స్ కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. హీరోలతో సీనియర్ నటులతో చిత్రీకరణ జరుపుతున్నపుడు ఎటువంటి టెన్షన్ ఉండదు. కాని ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కి వెళ్లినప్పుడు కథ డిమాండ్ చేసినట్లుగా ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉండాలి. అందులోని చిన్నపిల్లల నటనలో ఏ మాత్రం తేడా కొట్టినా ఆ తర్వాత సీనియర్ నటుడు సీన్స్ లోకి ఎంట్రి ఇచ్చి లాభం ఉండదు.

కానీ సీనియర్ దర్శకులు ఎక్కువగా అటువంటి లోపలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వరు. సినిమా రిజల్ట్ విషయం తర్వాత సంగతి కానీ చైల్డ్ క్యారెక్టర్స్ ని ఎంచుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. రీసెంట్ గా స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య పాత్రకి ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా నటించిన చైల్డ్ యాక్టర్ సంజయ్ బాగా క్లిక్ అయ్యాడు. సినిమాలో అతను కనిపించింది కొద్దీ సేపే అయినా అందరిని అక్కట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దాదాపు  కొన్ని సీన్స్ లో భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ని పాత్రను చూసుకున్నప్పుడు బయపడ్డావా అని అడిగితే సంజయ్ అస్సలు బయపడలేదు అంటున్నాడు. కానీ తన పాత్రను కొనసాగించిన ఎస్.జే సూర్య క్యారెక్టర్ ను చూసినప్పుడు మాత్రం భయపడ్డానని వివరించాడు.

ఇక తను ఆ సైకో క్యారెక్టర్ అంత బాగా చెయ్యడానికి కారణం దర్శకుడు మురుగదాస్ అసలు కారణం అంటున్నాడు. ఎందుకంటే ప్రతి సీన్ లోని హావభావాలతో సహా దర్శకుడు చేసి చూపించారని తెలిపాడు.
Tags:    

Similar News