స్క్విడ్ గేమ్స్ సీక్వెల్ .. ఊపిరి బిగ‌బ‌ట్టండి

Update: 2022-01-22 06:04 GMT
నెట్ ఫ్లిక్స్ సూప‌ర్ డూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ లలో `స్క్విడ్ గేమ్స్` ఒక సంచ‌ల‌నం. ఈ గేమ్ విడుదలైన ఒక నెలలోనే దాదాపు 1.65 బిలియన్ (16.5కోట్ల‌) గంటల వీక్షణను పొందింది. నెట్ ఫ్లిక్స్ భారతీయ అభిమానులు కూడా స్క్విడ్ గేమ్స్ ని చాలా ఆస్వాధించారు.అయితే ఇది కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది. ఊపిరిబిగ‌బ‌ట్టేంత ఉత్కంఠ‌తో భీభ‌త్సంతో ఉంటుంది.

 ఇదే అంశం ప్రదర్శనను చాలా ప్రత్యేకమైనదిగా ముద్ర వేసేందుకు కార‌ణ‌మైంది. కోట్లాదిగా ప్ర‌జ‌లు ఈ గేమ్ కి వీరాభిమానులుగా మారారంటే అందుకు త‌గ్గ కంటెంట్ ఈ గేమ్ సిరీస్ లో ఉంది.

చాలాకాలంగా అభిమానులు సీక్వెల్ గురించి అంతే ఆస‌క్తిక‌రంగా వేచి చూస్తున్నారు. దీనికి సీక్వెల్ ఉంద‌ని ప్ర‌క‌టించ‌గానే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ‌. వాస్తవానికి సీజన్ 2 ప్రకటన కోసం ఎదురు చూసిన‌వారే ఎక్కువ‌.

 ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సిరీస్ ఉంటుంద‌ని ఎవ‌రూ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. రెండవ సీజన్ గురించి నెట్ ఫ్లిక్స్ ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తాజాగా ఓటీటీ దిగ్గజం సూపర్ హిట్ సిరీస్ కి సీజన్ 2 ఉంటుందని ధృవీకరించింది.

 ఇలాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌కు సీక్వెల్‌తో ముందుకు రాకపోవడం పాపం అని భావిస్తోంది నెట్ ఫ్లిక్స్.

తాజాగా సంస్థ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 చాలా ఎక్కువగా అల‌రిస్తుందని ధృవీకరించారు. దర్శకుడు హ్వాంగ్ డాంగ్-హ్యూక్ తన బృందం వాస్తవానికి సీజన్ 2 కోసం కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు చేశార‌ని టీమ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు.

వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ గేమ్ షో

చిన్నా పెద్దా అనే విభేధం లేకుండా అన్ని వ‌ర్గాల‌ను అల‌రించిన మోస్ట్ ఫేమ‌స్ గేమ్ షో రాక కోస‌మే అంతా వెయిటింగ్. ఈ సెప్టెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వ‌చ్చిన‌ స‌ద‌రు గేమ్ షో ఓటీటీలో గొప్ప ఆద‌ర‌ణ పొందిన‌ నంబ‌ర్ 1 ప్రదర్శనగా సంచ‌ల‌నాలు సృష్టించింది.

 స్క్విడ్ గేమ్ ఆధారంగా అన్ లిమిటెడ్ గా మీమ్ లు గేమ్ లు పుట్టుకొచ్చాయి. చాలా త‌క్కువ కాలంలో గొప్ప ఆద‌ర‌ణ పొందిన గేమ్ షోగా అవ‌త‌రించింది. అందుకే ఇప్పుడు సీజ‌న్ 2 కోసం అభిమానుల నుంచి అసాధార‌ణ డిమాండ్ నెల‌కొంది. ఇదే విష‌యాన్ని అంగీక‌రించిన స్క్విడ్ గేమ్ సృష్టికర్త.. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత హ్వాంగ్ డాంగ్ హూక్ సీజ‌న్ 2 కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

 ఈసారి రెండవ సీజన్ కథాంశం భిన్నంగా ఉంటుంది. ప్రధాన పాత్ర గి హన్ ని అనుసరించి ఆస‌క్తికరంగా సాగుతుంద‌ని తెలిపారు. ప్రధాన పాత్ర గి హన్ సీజన్ 2లో ప్రపంచం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే వాడిగా క‌నిపిస్తాడు. పార్ట్ వ‌న్ స్ఫూర్తితోనే దర్శకుడు సీజన్ 2ని ప్రకటిస్తూ  ..మీరు మాకు ఎటువంటి ఛాయిస్ ను వదిలిపెట్టరు అని వ్యాఖ్యానించారు.

అయితే రెండవ సీజన్ ను రూపొందించాల్సి ఉంద‌ని దానికోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నామ‌ని అన్నారు. `స్క్విడ్ గేమ్ 2` కోసం ఇన్నాళ్లుగా అభివృద్ధి చెందిన ప్రణాళిక లేదు. కానీ ఇప్పుడు క్లారిటీ వ‌చ్చిందని దర్శకుడు అంగీకరించాడు. కానీ ఇప్పుడు అతను ఒంటరిగా చేయనని దాని కోసం చాలా మంది రచయితలను .. బహుళ అనుభవజ్ఞులైన దర్శకులను తీసుకురావాల్సి ఉంద‌ని ఇంత‌కుముందే చెప్పాడు.

స్క్విడ్ గేమ్ సిరీస్ అనేది ప్రాణాంతకమైన మలుపులతో సాగే పిల్లల గేమ్ లలో పాల్గొనే గ్రేక‌ల‌ర్ పాత్రల సమూహం. విజేతలు తమ అప్పులు తీర్చడానికి తగినంత డబ్బు తీసుకుంటారు. దీనికి కొన‌సాగింపు భాగంలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయ‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News