ఇంటర్వ్యూ: 'భళా తందనాన' లో మునుపెన్నడూ చూడని క్లైమాక్స్ చూస్తారు'

Update: 2022-05-05 13:08 GMT
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ''భళా తందనాన''. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని రేపు (మే 6) థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు.

* దర్శకుడు చైతన్య దంతులూరి కథ చెప్పగానే మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
౼ ఈ కథ నాకు బాణం సినిమా అప్పుడే చెప్పారు. 'బసంతి' టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. అయితే ముందుగా ఈ ప్రొడక్షన్ వేరే వేరే అనుకున్నాం ఫైనల్ గా సాయి కొర్రపాటి గారు రావడంతో ఈ సినిమాకు ఒక క్రేజ్ ఏర్పడింది.

* ఇందులో కొత్తగా చూపించే అంశాలేంటి?
౼ ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది.  క్లైమాక్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

* 'KGF' విలన్ గరుడ రామ్ మీకు విలన్ గా నటించడం ఎలా అనిపించింది?
౼ కె.జి.ఎఫ్. వంటి సినిమాతో దేశం మొత్తం తెలిసిన విలన్ ఆయన. అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయన నా సినిమాలో విలన్ ఏంటి అనేది అందరికీ అనిపిస్తుంది. మొదట్లో నాకూ అనిపించింది. మొదట నేను భయపడ్డాను. ఎందుకంటే కెజిఎఫ్ లో చూసిన ఆయన నటన అలాంటిది. కానీ సెట్లో ఆయన చాలా హంబుల్గా వుండడం చూసి ఆశ్చర్యపోయా. పైగా ఆయన మన తెలుగువాడు కావడం విశేషం. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు.

* 'భళా తందనాన' టైటిల్ పెట్టడానికి కారణం..?
౼ ఇది అన్నమయ్య కీర్తన లోనిది. ఆయన ఎన్నో వేల కీర్తనలు రాశారు. అందులో తందనానా భళాతందనానా అంటూ విప్లవాత్మకమైన కీర్తన రాశారు. ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. కామన్ మ్యాన్ కు రీచ్ అవుతుంది. అచ్చమైన తెలుగు పదం ఇది. ఇప్పటి జనరేషన్ కి కూడా తెలియాలని పెట్టాం. ఈమధ్య చాలా ఆంగ్ల పదాలు వస్తున్నాయి. నాకు తెలుగు టైటిల్స్ పెట్టడం అంటే ఇష్టం. బ్రోచెవారెవరురా - రాజరాజఛోళా.. వంటి నా టైటిల్స్ అన్నీ తెలుగులోనే వుంటాయి.

* దర్శకుడు చైతన్యతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
౼ నేను 'బాణం' నుంచి తనతో ట్రావెల్ అయ్యాను. 14 ఏళ్ళ అనుబంధం. తను సెట్లో మోనిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో.. లైటింగ్ ఎట్లా పెట్టారో.. నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మానిటర్ తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. ఆయనకు అన్ని శాఖలపై పట్టు వుంది. అందుకే ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

* వారాహి బ్యానర్ లో చేయడం ఎలా అనిపిస్తుంది?
౼ డెఫినెట్ గా మంచి బేనర్ లో చేశానని తృఫ్తి వుంది. సాయి కొర్రపాటి గారు క్యాస్టింగ్ గాని టెక్నీషియన్స్ గానీ, నిర్మాణ విలువల్లో కానీ వెనుకంజ వేయరు. ఆయనకు అన్నింటిలోనూ అనుభవం ఉంది. ఇటీవల వచ్చిన వారాహి సినిమాలో మా సినిమా ది బెస్ట్ అవుతుంది.

* ట్రైలర్ లో చూపించినట్లుగా డబ్బే ప్రధానాంశమా?
౼ అదొక్కటే కాదు సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్సివ్ కథ. చాలా బాగుంటుంది. ఈ సినిమా చెప్పగానే నేను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో చాలా ఫన్ కూడా ఉంటుంది.

* మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
౼ నేను కామన్ మ్యాన్ గా నటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారంతో తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర. ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

* కేథరిన్ నటన ఎలా అనిపించింది?
౼ ఆమె చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది.

* ఈ సినిమా మాస్ ప్యాట్రన్ లో అనిపిస్తుంది?
౼ నేను ఇంతకుముందు చిన్న దొంగగా చేశాను. కానీ కామన్ మ్యాన్ గా చేయడం ఇదే ఫస్ట్. కామన్ మ్యాన్ సొసైటీకి ఏం చేయగలడనే కోణంలో మాస్ అప్పీల్ వుంటుంది. ఒక బాధ్యతతో కూడిన పాత్ర కాబట్టి అలా అనిపిస్తుంది. ఇది వాంటెడ్ గా చేయాలని చేయలేదు. కథ పరంగా పాత్ర పరంగా వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను

* సినిమా డిసప్పాయింట్ అయితే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది?
౼ తప్పకుండా కొంచెం బాధ వుంటుంది. సినిమా బాగా ఆడాలని తీస్తాం. రిలీజ్ తర్వాత అది ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎటువంటి తీర్పు ఇచ్చినా మనం స్వీకరించాలి. ఈ ప్రాసెస్ లోనే పెట్టిన డబ్బులు పోయినా ఎవరైనా లాస్ అయిన సందర్భాలు తక్కువ. నేను చేసిన సినిమా వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

* మణిశర్మ శర్మ సంగీతం ఎలా అనిపించింది?
౼ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బీజిఎమ్స్ చాలా ఇంపార్టెంట్. మణిశర్మ చక్కటి బాణీలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా ఇచ్చారు ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా కీలకం. ఆ సౌండ్ విని చాలా మంది మళ్లీ మళ్లీ రావాలి అనిపించేటట్లుగా ఆయన మలిచారు ఇందులో. కొత్త బీజియమ్ మనం వింటాం. పాటలు కూడా సందర్భానుసారంగా ఉంటాయి

* ఇందులో లవ్ సీన్స్ ఎలా వుంటాయి?
౼ నేను తనకి లవ్ ప్రపోజల్ చేసినా.. తను నాకు చేసినా ఈ సందర్భంగా చాలా కొత్తగా ఉంటాయి. ఇంతవరకు ఏ సినిమాలో రాలేదని నేను భావిస్తున్నాను.

* డిసప్పాయింట్ అయినప్పుడు ఈ కాంబోలో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
౼ కాంబినేషన్ లో చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమే. నేను ఇప్పుడు చేసిన సినిమాల వల్ల గుర్తింపు రావడం.. కొత్త డైరెక్టర్లు నాతో చేసిన తర్వాత పెద్ద స్టార్ తో చేయడం ఆనందంగా వుంది.

* టైటిల్ లో కత్తి - కలం ఉంది. దాని అర్థం ఏమిటి?
౼ కలం అనేది జర్నలిస్టు వృత్తి. కత్తి అనేది విలన్ కోణంలోనిది. హీరోకి సంబంధం లేదు.

* ఇప్పటివరకు విష్ణుకి సెన్సేషనల్ హిట్ అనేది లేదు కదా?
౼ నిజమే. ఇప్పటి వరకూ నాకు అటువంటిది దక్కలేదు. అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను.

* ట్రైలర్ లో రెండు వేల కోట్లు అనేది వుంది. రెండు వేల కోట్లు ఏమిటి?
౼ అదే కథ. అనుకోకుండా రెండు వేల కోట్ల సంఘటనలో నేను ఇరుక్కుంటాను. ఆ తర్వాత ఏమయిందనేది తెరపై చూడాల్సిందే.

* కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?
౼ ఇప్పుడిప్పుడే మంచి కథలు వస్తున్నాయి. 'అల్లూరి' అనే సినిమా చేస్తున్నా. అది ఒక పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది.
Tags:    

Similar News