'వీరభోగ వసంత రాయలు'.. ఇప్పుడు #మీటూ తర్వాత క్లోజ్ గా ఫాలో అవుతున్న టాపిక్ ఇదే. ఎందుకంటారా? సినిమాకు రివ్యూయర్లు తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. విమర్శకులు చీల్చి చెండాడారు. ఆడియన్స్ అర్థం కాలేదన్నారు. దీంతో యువదర్శకుడు ఇంద్రసేన అప్సెట్ అయ్యాడు.
ఫెయిల్ అయితే అందరూ అప్సెట్ అవుతారు. ఏం.. మీరెప్పుడూ ఫెయిల్ కాలేదా? కానీ ఇంద్రసేన నేను ఫెయిల్ కాలేదు అంటూ రివ్యూయర్లపై విమర్శకులపై కత్తి దూశాడు. నా సినిమా కల్ట్ క్లాసిక్.. మీకు అర్థం కాలేదు ఏదో ఒకరోజు మీరు అర్థం చేసుకుంటారంటూ మండి పడ్డాడు. వర్మ స్టైల్ లో ఇంగ్లిష్ వాళ్ళకు కూడా సరిగా అర్థం అవుతుందో లేదో తెలియని ఒక పొడవాటి ఆంగ్ల సమాస విన్యాసంతో ఒక ప్రవల్లికను విసిరాడు. ఇంకేముంది. టాలీవుడ్ దద్దరిల్లింది. విమర్శకులను తిట్టడం ఫ్లాపు సినిమా డైరెక్టర్లకు సమోసా తిన్నంత కామనే. అదేం కొత్త విషయం కాదు. కానీ ఇలా మీరు సూడో ఇంటలెక్చువల్స్ బ్రెయిన్స్ అంటూ వాళ్ళకి అర్థం కాని భాషతో కత్తి దూయడం మాత్రం ఖచ్చితంగా కొత్తే.
కట్ చేస్తే వీర భోగ వసంత రాయలు ఎంట్రీ ఇచ్చాడు... ఎవరో అనుకోకండి. సినిమా అసలు హీరో శ్రీ విష్ణు. "రివ్యూయర్స్.. పోస్టర్స్ గురించి డైరెక్టర్ మాట్లాడిన విషయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా దృష్టికోణంలో నేనెప్పుడూ రివ్యూయర్స్ కు గౌరవం ఇచ్చాను.. మద్దతిచ్చాను." అని డైరెక్టర్ అభిప్రాయాలకు హిమాలయాలంత దూరం జరిగాడు.