అందం ఉంది.. స్పీడూ ఉంది... అంతకుమించి నటప్రతిభకు కొదవేమీ లేదు. ఇక డ్యాన్సులు ఇరగదీయడంలో కేకో కేక! .. ఇదీ 20ఏళ్ల శ్రీలీలకు దక్కుతున్న ప్రశంస. ఆరంభమే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన `పెళ్లి సంద-డి` సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న ఈ యువ నటి కెరీర్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగిపోతోంది. రెండో సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా ఆఫర్ పట్టేసింది. ఇది రొటీన్ మసాలా మూవీనే అంటూ క్రిటిక్స్ విశ్లేషించినా కానీ శ్రీలీలకు ఎక్కువ మార్కులేసారు.
ఇది నిజంగానే తనకు పెద్ద ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ధమాకా రవితేజ కంటే శ్రీలీలకు పెద్ద ప్లస్ అన్న గుసగుస వినిపిస్తోంది. శ్రీలీల డ్యాన్సులు మైండ్ బ్లోవింగ్. తన అందచందాలు చురుకుదనం సొగసు నటనా నైపుణ్యం ఇలా అన్ని కోణాల్లో పలువురి నుంచి ప్రశంసలు అందుకుంది.
ముఖ్యంగా ధమాకా థియేటర్లలో ఆడియెన్ శ్రీలీల సొగసుకు మైమరిచిపోతున్నారు. ఇక తెలుగు స్పష్టంగా మాట్లాడలేని ముంబై బొమ్మలతో పోల్చితే శ్రీలీల చాలా బెటర్ అన్న టాక్ కూడా టాలీవుడ్ లో ఉంది. ఇది తనకు మరింత పెద్ద ప్లస్ కానుంది.
తాజా గుసగుసల ప్రకారం.. అగ్ర హీరోలంతా ఇప్పటికే శ్రీలీల కాల్షీట్ల కోసం తమ దర్శకనిర్మాతలకు సిఫారసు చేస్తున్నారంటే ఈ యంగ్ బ్యూటీ ప్రభావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ ఎండ్ లోనే నాలుగైదు అడ్వాన్సుల సూట్ కేసులు శ్రీలీల ఇంటికి వెళతాయని కూడా గుసగుస వినిపిస్తోంది.
అయితే అన్నిసార్లు పప్పులుడకవు. అపజయాలు యావరేజ్ లు తనను ఆదుకోలేవు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే తప్ప గోల్డెన్ లెగ్ అని ముద్ర వేయరు. పూజా హెగ్డే- కియరా అద్వానీ సైతం ఇలానే దూసుకొచ్చి అలా వెంటనే ఫ్లాపులతో చల్లారిపోయారు. కానీ ప్రతిభ వల్ల అవకాశాలు అందుకుంటున్నారు. శ్రీలీల కూడా ఇదే కేటగిరీకి చెందుతుంది. కానీ జాగ్రత్త పడడం అవసరం. సరైన కథల ఎంపిక పాత్రల్లో వైవిధ్యం కూడా అవసరం. ఒక మంచి బంపర్ హిట్టు తన కెరీర్ గ్రాఫ్ ని పారితోషికం రేంజును పెంచుతుందనడంలో సందేహం లేదు.
అనగనగా ఒక రోజు - జూనియర్ అనే మరో రెండు తెలుగు చిత్రాల్లోను శ్రీలీల నటిస్తోంది. శ్రీలీల కిస్ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో తొలి రెండు సినిమాలతో నటిగా ఆకట్టుకుంది. ఈ చక్కనమ్మ తొందర్లోనే చుక్కల్లో చందమామ అవుతుందని ఇప్పటికి ట్రేడ్ గెస్ చేస్తోంది. అందుకే ఇప్పుడు అగ్ర నిర్మాతలు అడ్వాన్స్ సూట్ కేసులతో ఒప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వైరల్ అయిపోతున్నాయ్! ధమాకా బ్యూటీ జాక్ పాట్ కొట్టినట్టే!!