ప్రేమ వ్యవహారంపై స్పందించిన బుల్లి తెర రాములమ్మ

Update: 2020-05-10 23:30 GMT
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో శ్రీముఖ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అభిమానులు బుల్లి తెర రాములమ్మ అంటూ శ్రీముఖిని పిలుచుకుంటూ ఉంటారు. తెలుగు టాప్‌ యాంకర్స్‌ జాబితా తీస్తే అందులో శ్రీముఖి పేరు ముందు వరుసలోనే ఉంటుంది. అంతగా ఫేమస్‌ అయిన శ్రీముఖి గత ఏడాది తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో పార్టిసిపెట్‌ చేసి రన్నరప్‌ గా నిలిచింది. శ్రీముఖి ఖచ్చితంగా విన్నర్‌ అనుకున్నారు. కాని రాహుల్‌ అనూహ్యంగా ఆమెను రెండవ స్థానంలో నిలిపి ట్రోఫీని దక్కించుకున్నాడు. ఆ షో లోనే శ్రీముఖి తన ప్రేమ గురించి రివీల్‌ చేసింది.

ఆ ప్రేమ విఫలం అయ్యిందని చెప్పిన శ్రీముఖి మళ్లీ రిలేషన్‌ లో ఉందంటూ ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి శ్రీముఖి ఆ వార్తలను కొట్టి పారేసింది. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతానికి తాను ప్రేమించేంతటి ఖాళీగా లేను. రిలేషన్‌ షిప్‌ కోసం నేను టైం కేటాయించలేనంత బిజీగా ఉన్నానంది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా పూర్తిగా కెరీర్‌ పైన అంది.

సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా కూడా వాటికి శ్రీముఖి సున్నితంగా నో చెబుతూ వస్తోంది. ఎక్కువ శాతం బి గ్రేడ్‌ పాత్రలు వస్తున్న కారణంగానే శ్రీముఖి వాటికి నో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీముఖి ఈ లాక్‌ డౌన్‌ లో కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు కొన్ని స్కిట్స్‌ ను చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చింది.
Tags:    

Similar News