మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'ధమాకా'. త్రినాథ రావు నక్కిన ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల తొలి సారి మాస్ రాజా రవితేజకు జోడీగా నటిస్తోంది. టీజర్ ట్రైలర్ లతో ఇప్పటికే మంచి బజ్ ని సొతం చేసుకున్న ఈ సినిమాని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 23న ఇయర్ ఎండింగ్ లో 'ధమాకా' థియేటర్లలోకి రాబోతోంది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, 'జింతాక్ జింతాక్ సాంగ్' నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ రవితేజ చెప్పిన పంచ్ డైలాగ్ ఓ రేంజ్ లో పేలి సినిమాని నెట్టింట ట్రెండ్ చేస్తోంది. చాలా రోజుల తరువాత రవితేజ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఓ క్యారెక్టర్ లో స్వామిగా, మరో పాత్రలో ఆనంద్ చక్రవర్తిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీంతో ఈ మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ ఊగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచేసిన మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేస్తూ పరమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరోయిన్ శ్రీలీల హీరో రవితేజ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాకుండా పేరు మార్చుకుంటానని సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తనదైన పంథాలో మాట్లాడిన శ్రీలీల మాస్ రాజా ఫ్యాన్స్ ని ఫిదా చేసేసింది. రవితేజ గారికి నేను పెద్ద అభిమానిని అని, చాలా అంకిత భావంతో పని చేసే హీరో ఆయన అని వెల్లడించింది. అంతే కాకుండా ఒక ఫైట్ సీక్వెన్స్ లో రవితేజకు గాయమైన విషయాన్ని కూడా బయటపెట్టింది.
గాయం కారణంగా ఆయనకు కాలికి 12 కుట్లు పడ్డాయని, ఆ గాయాన్ని లెక్క చేయకుండా రవితేజ 'దండకడియాల్' సాంగ్ షూట్ లో పాల్గొన్నారని, ఒక మెడికల్ స్టూడెంట్ గా ఆ గాయం ఎంతగా బాధిస్తుందో తనకు తెలుసునని, అయితే పాటలో ఎక్కడా ఆ గాయం బాధని కనిపించకుండా రవితేజ నటించారని, అది మీరు గుర్తుపడితే నా పేరు మార్చుకుంటానని అభిమానులతో సవాల్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.