తన మానాన తాను క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసుకోకుండా... వర్మ మాటలు విని పవన్ కళ్యాణ్ ను విమర్శించింది శ్రీరెడ్డి. అసలే పవన్ ను దేవుడిగా ఆరాధించే అభిమానులు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్లు ఊరుకుంటారా ఆమె కోసం రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. ఆమె ఓ స్టూడియోకు వస్తుందని తెలిసి అక్కడ రచ్చ చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ఛానెల్ ఆ ఛానెల్ అని లేదు అన్ని ఛానెళ్లలోనూ శ్రీరెడ్డే కనిపిస్తోందిప్పుడు. వర్మ డైరెక్షన్ లో ఆమె పవన్ పై విరుచుకుపడడం అసభ్యంగా వేలు చూపించి మాట్లాడడం పవన్ అభిమానులకు పిచ్చకోపం తెప్పించింది. పవన్ అభిమానులు శ్రీరెడ్డిపై ఇప్పటికే కోపంతో రగిలిపోతున్నారు. ఆమె బుధవారం రాత్రి ఓ స్టూడియోకు ఇంటర్వ్యూ కోసం వస్తోందని వారికి తెలిసింది. బైకులపై ఆ స్టూడియో ముందుకు చేరుకుని రచ్చ రచ్చ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటికి వెళ్లేందుకు స్టూడియో నుంచి బయటికి రాగానే ఆమెను చుట్టుముట్టారు. ఈలోపే పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీరెడ్డి కారును దారి మళ్లించారు. అయనా పవన్ అభిమానులు వదిలి పెట్టకుండా బైకులపై కారును వెంబడించారు.
చివరికి ఏం చేయాలో తెలియక పోలీసులు శ్రీరెడ్డిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కాసేపు అక్కడే ఉంచారు. అభిమానులంతా వెళ్లిపోయాక అర్థరాత్రి తామె వెళ్లి శ్రీరెడ్డిని ఇంటి దగ్గర దించి వచ్చారు. ఈసారంటే శ్రీరెడ్డి తప్పించుకుంది కానీ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ అంత సులువుగా వదిలేయరు. వారిని ఆపడం కాస్త కష్టమే. ఆమె ఎక్కడికెళ్లినా పవన్ అభిమానులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.