మాటలతో సరిపెట్టకపోవటమే కాదు.. అవసరమైతే చేతలతోనూ దేనికైనా సిద్ధమేనంటూ టాలీవుడ్ పెద్దలకు షాకిచ్చింది శ్రీరెడ్డి. తాను చేస్తున్న పోరాటాన్ని తప్పు పట్టే వారు ఎవరైనా.. వారు ఎంతటి వారినైనా తాను ఊరుకునేది లేదన్న విషయాన్ని తాజాగా తన మాటలతో చెప్పే ప్రయత్నం చేసింది.
నిన్నటివరకూ తన పోరాటంపై స్పందించాలంటూ పవన్ ను కోరిన శ్రీరెడ్డి.. తీరా ఆయన నోరు విప్పిన తర్వాత లాజిక్ గా కౌంటర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇవాల్టి రోజున పవన్ కంటే కూడా శ్రీరెడ్డి ప్రముఖురాలిగా మారిపోయింది.. బాలీవుడ్ లోనూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారంటూ ఆ మధ్యన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పటం తెలిసిందే.
ఇలాంటివి శ్రీరెడ్డి మనసులో బాగానే రిజిష్టర్ అయినట్లుగా కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్ లో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన పాశవిక దాడి నేపథ్యంలో పవన్ కల్యాణ్ నిరసన ర్యాలీ నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీరెడ్డి అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన సమాధానమిస్తూ.. అర్థనగ్నంగా నిరసన చేసే కన్నా కోర్టులు.. కేసుల ద్వారా న్యాయపోరాటం చేయాలన్న సూచన చేశారు.
దీనికి తాజాగా శ్రీరెడ్డి కౌంటర్ వచ్చారు. తనకు పవన్ అంటే చాలా ఇష్టమని.. ఆయన పోరాట స్ఫూర్తి తనకు చాలా ఇష్టమన్నారు. తెలుగు వాళ్ల కోసం ఆయన పోరాడే తీరు.. ప్రత్యేక హోదా కోసం ఆయన చేస్తున్న ఆందోళనలు తనకెంతో ఇష్టమన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్.. ప్రజా పోరాటం ద్వారా కాకుండా చట్ట ప్రకారం పోరాడొచ్చు కదా? అని ప్రశ్నించారు. హోదా సాధన కోసం కోర్టులకు వెళ్లకుండా తనదైన బాటలో ఆయన నడుస్తున్నారు కదా.. నన్ను కూడా అలానే అనుకోవచ్చు కదా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి.. తన మాదిరే పోరాటం చేసే మరొకరి గురించి తన మాదిరే ఆలోచించాలి కదా అంటూ ప్రశ్నించిన శ్రీరెడ్డి.. తనను పోరాటయోథురాలిగా పేరును ప్రస్తావించే విషయంలో పవన్ కు అభ్యంతరమున్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి పోరాటాలు వేర్వేరు అంశాల మీదనే అయినా.. తన మాదిరి పోరాటం చేసే సాటి వారి విషయంలో కనీసం మర్యాద.. గౌరవంగా వ్యవహరించాలి కదా అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.