శ్రీరెడ్డి వ్యాఖ్యలతో టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. తనను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ వాడుకొని వదిలేశాడని, రామానాయుడు స్టూడియోలోని ఇదంతా జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపాలని జాతీయ మీడియా ప్రశ్నలు సంధించడంతో అభిరామ్ తో శ్రీరెడ్డి సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను బయటపెట్టింది. అయితే, ఆ ఫొటోలలో శ్రీరెడ్డిని అభిరామ్ ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నట్లు లేదని - ఇద్దరు ప్రేమికులు ఇష్టపూర్వకంగా కలిసిమెలిసి దిగిన సెల్ఫీల్లా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ తెలుగు న్యూస్ చానెల్ వారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, శ్రీరెడ్డిని ఇరుకున పెట్టే కొన్ని ప్రశ్నలను వారు సంధించారు. తమ చానెల్ లో డిబేట్ సందర్భంగా శ్రీరెడ్డితో వారు ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రశ్నలు సంధించారు.
ఆ ప్రశ్నలివే....
1. తనకు జరిగిన అన్యాయంపై `మా`ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి బదులు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు?
2. టీవీ చానెల్స్ లో లైవ్ డిబేట్స్ - యూట్యూబ్ చానెల్స్ - సోషల్ మీడియాలో న్యాయపోరాటం చేయడానికి బదులుగా....కోర్టులను ఎందుకు ఆశ్రయించడం లేదు?
3. `మా`లో సభ్యత్వం ఇవ్వనందుకే అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నానని మొదట చెప్పి....ఇప్పుడు తెలుగు అమ్మాయిల కోసం పోరాడుతున్నాను అని చెప్పడం....పూటకో ప్రకటన చేయడం ఎందుకు?
4. అభిరామ్ తో నవ్వుతూ సెల్ఫీలు ఇష్టపూర్వకంగానే దిగావు కదా?
5. మీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఫొటోలు తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి...ఇప్పుడు మీ ఇద్దరికీ బ్రేక్ అప్ అయింది కదూ?
6. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన చాట్ హిస్టరీలోని వారు...మీతో కలిసి బయటకు వెళ్దామని అడిగినట్లుంది...సెక్స్ చేయాల్సిందిగా ఫోర్స్ చేయలేదుగా?
7. నన్ను చూస్తే మీకు మూడ్ రావడం లేదా అంటూ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ను అడగడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు?
8. ఆ ఫొటోలను బట్టి వారున్న ప్రదేశాలకే మీరు వెళ్లారు....చాలామందితో అతి చనువుగా వ్యవహరించారు...ఇదంతా ఎందుకు చేశారు?
9. సెక్స్ కోసం వారు మిమ్మల్ని బలవంతం చేస్తేనే నేరం అవుతుంది. ఇష్టపూర్వకంగా మీరే సెక్స్ కోసం ప్రేరేపిస్తే...ఆ కేసు నిలబడదన్న సంగతి మీకు తెలుసా?
ఈ ప్రశ్నలకు శ్రీరెడ్డి దగ్గర సమాధానాలు లేకపోవడంతో ఆమె అసహనానికి లోనైంది. తన పోరాటం...ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో సమానమని - తనపై ఈ రకంగా కొంతమంది జర్నలిస్టులు మాటల దాడి చేయాలని భావిస్తే తాను షో నుంచి వెళ్లిపోతానని శ్రీరెడ్డి ఫోన్ కట్ చేసింది.