ఏడాదికో లైఫ్ పార్ట‌న‌ర్.. శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌!

Update: 2019-06-10 03:24 GMT
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్య‌లు.. వంటి కార‌ణాల‌తో జాతీయ స్థాయిలో పాపుల‌ర్ అయింది న‌టి శ్రీ‌రెడ్డి. ఆ త‌రువాత కూడా ప‌లు సంద‌ర్భాల్లో మెగా సెల‌బ్రిటీల‌పై ప‌చ్చి బూతు కామెంట్లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఏ విష‌యంపైన అయినా ప‌చ్చిగా మాట్లాడే శ్రీ‌రెడ్డి పెళ్లి విష‌యంపై కూడా అదే స్థాయిలో స్పందించి అంద‌రినీ షాక్ కు గురిచేసింది. త‌న మైండ్ సెట్ ప్ర‌కారం త‌న‌కు పెళ్లి సూట్ కాద‌ని - త‌న‌కు న‌చ్చిన‌ట్లు విచ్చ‌ల‌విడిగా వుండ‌టానికే అధిక ప్రాధాన్య‌తనిస్తాన‌ని తేల్చి చెప్పేసింది. డేటింగ్ విష‌యంలోనూ త‌న‌కు క్లారిటీ వుంద‌ని ఏడాది పాటు డేటింగ్ లో వుంటే మ‌హా ఎక్కువ‌ని..ఆ త‌రువాత కొత్త భాగ‌స్వామిని వెతుక్కుంటాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

తాను ఫ్యామిలీ టైమ్ కాద‌ని - అలా వుండ‌టం త‌న‌కు అస్స‌లు సూట్ కాద‌ని చెప్పేసింది. త‌ను ప్లే గ‌ర్ల్ టైప్ అని అలాంటి జీవితాన్నే ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. దాన్నే ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తాన‌ని ఎలాంటి మోహ‌మాటం లేకుండా చెప్ప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. గ‌త కొంత కాలం క్రితం ఓ టీవీ ఛాన‌ల్ లో యాంక‌ర్‌ గా పనిచేసి ఆ త‌రువాత అవ‌కాశం రావ‌డంతో ఓ సినిమాలో మెరిసిన శ్రీ‌రెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌.. మా స‌భ్య‌త్వం వంటి కార‌ణాల‌ని అడ్డు పెట్టుకుని తారా స్థాయికి త‌న పాపులారిటీని పెంచేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె గురించి కామెంట్ చేయాలంటేనే సెల‌బ్రిటీలు భ‌యంతో పారిపోయే ప‌రిస్థితి.

అన్న‌ట్టు తెలుగు బిగ్ బాస్ షోలో ఎంట్రీ కోసం హీరో నానిని అన‌రాని మాట‌లు అన్న శ్రీ‌రెడ్డి త్వ‌ర‌లో త‌మిళంలో ప్రారంభం కాబోతున్న బిగ్‌ బాస్ షోలో పాల్గొన‌బోతోంది. అక్క‌డ ఆ షోతో ఎంత ర‌చ్చ చేస్తుందో చూడాలి. మొత్తానికి ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌తో త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకుంటున్న శ్రీ‌రెడ్డి.. ఈసారి మాత్రం త‌న క్యారెక్ట‌ర్ గురించి ఇంత సూటిగా మాట్లాడేయ‌డం కుర్ర‌కారులో.. ప్ర‌త్య‌ర్థుల్లోనూ చ‌ర్చ‌కొచ్చింది.
Tags:    

Similar News