తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ప్రకటించి సంచలనానికి తెరలేపింది శ్రీరెడ్డి. దానిని అరికట్టాలంటూ చేసిన ఆమె పోరాటం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇక - ఫిలిం చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో శ్రీరెడ్డి చూపిన తెగువకు భారీ స్థాయిలో మద్దతు లభించింది. కానీ, ఇందులోకి పెద్దలు ఎంటరవడం.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వివాదం కారణంగా శ్రీరెడ్డి పోరాటం అర్థాంతరంగా ముగిసిపోయింది. కానీ, సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టింగులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ ఏదో ఒక పోస్టు చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం శ్రీరెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తూ వచ్చింది.
శ్రీరెడ్డి వ్యవహార శైలికి కొంత మంది మద్దతు ఇస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయినా, ఆమె మాత్రం అస్సలు వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికీ తన అభిప్రాయాలను చెప్పడంతో పాటు మెగా ఫ్యామిలీ సహా ఇండస్ట్రీలోని కొందరు ముఖ్యులను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రకాలుగా పోస్టింగులు పెడుతోంది. దీంతో సదరు ప్రముఖులకు వ్యతిరేకులుగా పేర్కొనే వారి నుంచి శ్రీరెడ్డికి సపోర్టు లభిస్తోంది. మరోవైపు, ఆమె రాజకీయాలనూ వదలడం లేదు. గతంలో జనసేనను తప్ప తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితులను, ఆయా పార్టీల అధినేతలు, కీలక నేతలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసేది. తాజాగా ఆమె వైసీపీకి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది.
రెండు రోజుల క్రితం అయితే గోరింటాకుతో జగన్ అనే పేరును చేతిపై రాసుకుంది. అదే రోజు వైసీపీ అధినేత ఫొటోను పోస్టు చేసి ‘‘మీరు రావాలి.. అందరి లెక్కలు సరి చేయాలి. కావాలి జగన్.. రావాలి జగన్. ఎవ్వరి శత్రు శేషం ఉంచొద్దు’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఒక్క పోస్టే కాదు.. గతంలో కూడా చేసిన వాటన్నింటిని పరిశీలిస్తున్న కొందరు శ్రీరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆమె వైసీపీలో చేరబోతున్నారని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇక, వైసీపీలోని పలువురు నాయకులైతే శ్రీరెడ్డి తమ పార్టీలో చేరితే బాగుంటుందని బహిరంగంగానే అంటున్నారు. మరోవైపు, రాజకీయాల్లో లేకపోయినా దూకుడుగా వ్యవహరిస్తున్న శ్రీరెడ్డి.. ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి, దీనిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.