నిన్న సాయంత్రం హుటా హుటిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన `మా` ....శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని,....ఆమెను `మా` కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, మా అత్యవసరంగా మీడియా సమావేశం పెట్టడానికి కొంతమంది పెద్దల ఒత్తిళ్లే కారణమన్నది బహిరంగం రహస్యం. ఇప్పటికే శ్రీరెడ్డి బాయ్ కాట్ వ్యవహారంలో మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడం....తెలంగాణ సర్కార్ కు నోటీసులు జారీ చేయడం....మరో పక్క శ్రీరెడ్డి...ఫొటోలతో సహా కొందరి పేర్లు బయటపెట్టడం...వంటి పరిణామాలతో `మా `ఒక అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కర్ణుడి చావుకు వంద కారణాలన్న చందంగా ...శ్రీరెడ్డి వ్యవహారంలో `మా` యూటర్న్ తీసుకోవడానికి కూడా అనేక కారణాలుండవచ్చు. ఏది ఏమైనా ఈ వివాదానికి ఇంతటితో పుల్ స్టాప్ పెట్టాలని మా కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ‘మా’ లేటెస్ట్ ప్రెస్ మీట్ మై శ్రీరెడ్డి అభిప్రాయం మరోలా ఉంది.
నిన్నటి ప్రెస్ మీట్ పై శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది. ఆ ప్రెస్ మీట్ చూస్తున్నంతసేపూ తాను తెగ నవ్వుకున్నానని శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే, ఈ ప్రెస్ మీట్ పెట్టిన ‘మా’ తనను ఆహ్వానించడం మంచి పరిణామమేనని, `మా`మీద తాను నైతికంగా విజయం సాధించానని భావిస్తున్నానని శ్రీరెడ్డి తెలిపింది. తనను పండగ చేసుకోమన్న విధంగా `మా` సభ్యులు మాట్లాడారని, తనకు వాళ్లు భిక్ష వేయాల్సిన అవసరం లేదని చెప్పింది. `మా`లో సభ్యత్వం తన హక్కని, మరో రకంగా అయినా సభ్యత్వం తెచ్చుకునేదాన్నని తెలిపింది. ఆ ప్రెస్ మీట్...తనకు 20 శాతం మాత్రమే సంతోషాన్నిచ్చిందని, అసలు సమస్యలపై ‘మా’ స్పందించలేదని చెప్పింది. తనకు సభ్యత్వం ఇస్తానంటే కరిగిపోనని, తన పోరాటం కొనసాగుతుందని, ఎవ్వరినీ వదిలిపెట్టనని సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే త్వరలోనే తన దగ్గర ఉన్న వివరాలను బయటపెట్టేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో తనకు అన్యాయం చేసిన వారికి శిక్షపడాలని శ్రీరెడ్డి గట్టిగా ఫిక్సయినట్లుందని, తన ఉదంతంతో భవిష్యత్ లో కాస్టింగ్ కౌచ్ సమసిపోవాలని ఆమె భావిస్తోందని అనుకుంటున్నారు.