తాను సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసినంత కాలం ఆధారాలేవీ ఆధారాలేవీ అన్నారని.. ఐతే ఇప్పుడు ఆధారాలు చూపిస్తే.. వాటి మీద లేని పోని వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ తనతో ఉన్న ఫొటోలను శ్రీరెడ్డి రెండు రోజుల కిందట విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు చూశాక చాలామందికి వాస్తవం బోధపడిందని.. కానీ కొందరు మాత్రం విచిత్రంగా స్పందిస్తున్నారని ఆమె అంది. నేను ఇష్టపూర్వకంగానే అతడితో పడుకున్నానని.. అన్నీ చేయించుకున్నానని.. ఫొటోల్లో చాలా సంతోషంగా కనిపిస్తున్నానని జనాలు వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తుంటే తనకేం మాట్లాడాలో అర్థం కావడం లేదని శ్రీరెడ్డి అంది.
అభిరామ్ అవకాశాల పేరుతో పిలిచి లైంగికంగా లొంగబరుచుకునే ప్రయత్నం చేశాడని.. రామానాయుడు స్టూడియోలోనే తనతో శృంగారంలోనే పాల్గొన్నాడని.. ఇలా ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది. ఐతే తమను బలవంతంగా లొంగదీసుకుంటున్నపుడు ఏ అమ్మాయైనా ఎలా ఫొటో లేదా వీడియో తీయగలుగుతుందని ఆమె ప్రశ్నించింది. తామేమైనా నెత్తిన కెమెరా పెట్టుకుని తిరుగుతుంటామా.. ప్రతి మూమెంట్ నూ క్యాప్చర్ చేయడానికి అని ఆమె ప్రశ్నించింది. మనసులో ఎంత బాధ ఉన్నా ఫొటోలు అలాగే దిగుతారని.. తాను వెళ్లి అభిరామ్ తో అన్నీ చేయించుకోవాల్సిన కర్మ ఏం పట్టిందని ఆమె ప్రశ్నించింది. అభిరామ్ ను పెళ్లి చేసుకోవాలనో.. అతడి నుంచి ఇంకేదో ఆశించి అతడికి దగ్గర కాలేదని.. అవకాశాలిస్తానంటేనే వెళ్లానని శ్రీరెడ్డి స్పష్టం చేసింది.