కొంతకాలంగా నటి శ్రీరెడ్డి మీడియాకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. తన సంచలన వ్యాఖ్యలతో పాపులర్ అయిన శ్రీరెడ్డి అపుడపుడు సోషల్ మీడియాలో ఆ సంచలనాలను కొనసాగిస్తోంది. అపుడుపుడు లైవ్ సెషన్స్ లో తనకు నచ్చినట్టుగా మాట్లాడేసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పవన్ పై ఆర్జీవీ ప్రోద్బలంతో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా ఆర్జీవీకి మద్దతుగా నిలిచింది. వర్మ, నాగ్ ల కాంబోలో తెరకెక్కిన `ఆఫీసర్` చిత్రంపై శ్రీరెడ్డి ప్రశంసలు కురిపిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో నాగార్జున చాలా బాగా నటించారని, వర్మ గొప్ప దర్శకుడని కితాబిచ్చింది. కొంతమంది కావాలని పనిగట్టుకొని ఈ సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని ఆరోపించడం విశేషం.
వాస్తవానికి `ఆఫీసర్` సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. వర్మ ఖాతాలో మరో డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. వర్మ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆఫీసర్ గ్రేట్ మూవీ అంటూ శ్రీరెడ్డి ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, సినిమా చాలా బాగుందని, థియేటర్ కు వెళ్లి చూడాలంటూ ప్రమోట్ చేస్తోంది. మరో అడుగు ముందుకేసి ఈ సినిమాపై పిచ్చి రాజకీయాలు చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. మీ సినిమాలు విడుదలైనప్పుడు చూసుకుందాం అంటూ....వార్నింగ్ ఇచ్చింది. అయితే, నిజంగా ఆఫీసర్ కు హిట్ టాక్ వచ్చి ఉంటే శ్రీరెడ్డి చెప్పినా చెప్పకపోయినా...ప్రేక్షకులు ఆదరిస్తారని సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై ట్రోలింగ్ జరుగుతోంది. వర్మ మీద అభిమానం ఉన్నంత మాత్రాన ఈ రకంగా డిజాస్టర్ ను హిట్ చేయడం హాస్యాస్పదమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా వర్మగారి శిష్యురాలు కాబట్టి ...ఏదో ఒక విమర్శచేసి వార్తల్లో నిలవాలని చూస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు.