చెన్నై మీడియాతోనూ అదే ర‌చ్చా శ్రీ‌రెడ్డి!

Update: 2018-08-22 07:39 GMT
నోరు మంచిగా ఉండే ఊరు మంచిగా ఉంటుంద‌ని ఊరికే అన‌లేదు. సినీన‌టి శ్రీ‌రెడ్డి తీరు చూసినా.. ఆమె మాట‌లు విన్నా ఈ మాట చ‌ప్పున గుర్తుకు వ‌స్తుంది. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేయ‌టంలో శ్రీ‌రెడ్డి ఎంత‌టి ప్రావీణ్యం ఉందో తెలిసిందే.  తెలుగునాట త‌న మాట‌ల‌తో మంట‌లు పుట్టించి.. ఒక‌ద‌శ‌లో రోజూ టీవీల్లో గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు పెట్టిన ఆమె.. త‌ర్వాతి కాలంలో ఆమె మాట‌లే ఆమెకు శాపంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఆ మ‌ధ్య‌న చెన్నై వెళుతున్న‌ట్లు చెప్పి వెళ్లిన శ్రీ‌రెడ్డి.. మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి రాలేదు. కోలీవుడ్ న‌టులు.. ద‌ర్శ‌కుల‌ను చెడుగుడు ఆడేసుకుంటే.. ఆరోప‌ణ‌ల‌తో.. విమ‌ర్శ‌ల‌తో సంచ‌ల‌నంగా మారిన ఆమె.. చెన్నైలోనే సెటిల్ అవుతాన‌ని చెబుతోంది.తాజాగా ఆమె.. త‌న జీవితంలో ఎదురైన అనుభ‌వాల‌తో రెడ్డి డైరీ మూవీని చేస్తున్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే.

తాజాగా చెన్నై మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో త‌న నోరు దురుసుత‌నంతో ఆమె త‌న మాట‌ల్ని వెన‌క్కి తీసుకోవాల్సి వ‌చ్చింది. త‌న‌ను ఎవ‌రో ఏదో అన్నార‌న్న పేరుతో.. మీడియా ముందు ఇష్టం వ‌చ్చిన ప‌దాల్ని వాడేయ‌టం.. రాయ‌టానికి వీల్లేని విధంగా మాట్లాడ‌టం శ్రీ‌రెడ్డికి అల‌వాటే.

ఇదే తీరును ప్ర‌ద‌ర్శించిన శ్రీ‌రెడ్డి వైఖ‌రిని చెన్నై మీడియా ప్ర‌తినిధులు బ‌లంగా వ్య‌తిరేకించారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తాను వాడిన ప‌దాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు త‌న‌కు సాయం చేయ‌లేద‌ని.. త‌న‌కు అండ‌గా నిల‌వ‌లేద‌ని ఆమె త‌ప్పు ప‌ట్టారు. హైద‌రాబాద్‌ లో ఉన్న‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌కు స్ఫూర్తిదాత‌గా చెప్పిన ఆమె.. తాజాగా ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్లున్నారు.

త‌న‌కు స్ఫూర్తిదాత దివంగ‌త అమ్మ జ‌య‌ల‌లిత అని.. తాను సినిమాలు చేయ‌టానికి చెన్నై రాలేద‌ని.. మ‌హిళా స‌మ‌స్య‌ల మీద పోరాడేందుకు తాను చెన్నైలో సెటిల్ కానున్న‌ట్లు చెప్పారు. సినిమాల్లో న‌టిస్తూ.. స‌మాజ సేవ చేయ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్న ఆమె తీరు చూస్తే.. ఎక్క‌డ ఎలా ఉండాలో బాగా శ్రీ‌రెడ్డికి బాగానే వంట‌ ప‌ట్టిన‌ట్లుగా ఉంది. కాకుంటే త‌న నోటిని కాస్త అదుపులో ఉంచుకుంటే మ‌రింత బాగుంటుంద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News