తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా శ్రీ సత్య సుపరిచితురాలు. ప్రస్తుతం తెలుగు అమ్మాయి తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో కీలక కంటెస్టెంట్ గా ఉంది. ఈమె టాప్ 6 లేదా టాప్ 7 వరకు ఉండే అవకాశం ఉందని ఆమె అభిమానులతో పాటు బిగ్ బాస్ ను రెగ్యులర్ గా చూస్తున్న వారు నమ్మకంగా చెబుతున్నారు. ఫైనల్ వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈమెను బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం రోజు నాగార్జున చాలా విభిన్నంగా పరిచయం చేశారు. తినే విషయంలో ఈమె తర్వాతే అందరూ అన్నట్లుగా కామెడీ చేశాడు. తనకు తిండి అంటే చాలా ఇష్టం అంటూ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్ లో కూడా ఈమె తిండికి ఇచ్చినంత ప్రాముఖ్యత మరి దేనికి ఇవ్వడం లేదని నాగార్జున మరో సందర్భంగా కామెడీ చేశాడు.
బిగ్ బాస్ లో అడుగు పెట్టడానికి ముందు శ్రీసత్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో బుల్లి తెర ఇండస్ట్రీలో కూడా తెలుగు అమ్మాయిలకు ఇబ్బందులు ఉంటాయి. తెలుగు అమ్మాయి అనగానే ఒక చిన్న చూపును మాపై చూపిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ విజయవాడ సత్యనారాయణ పురం అమ్మాయి.
సీరియల్స్ షూటింగ్ సమయంలో ఇతర భాషల హీరోయిన్స్ తో పోల్చితే మమ్మల్ని తక్కువగా చూస్తూ ఉంటారు. మా యొక్క ఫుడ్ నుండి ట్రావెల్ వరకు అన్నీ మేమే చూసుకోవాలి. కానీ వేరే చోటు నుండి వచ్చిన వారికి మాత్రం అన్ని సౌకర్యాలను కల్పిస్తారంటూ శ్రీ సత్య బుల్లి తెర సీరియల్స్ మేకర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో వివక్ష ఎదుర్కొంటున్నారు అంటూ చాలా కాలంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలకు జోడీగా నటించలేక పోతున్నారు.. ఏ ఒక్కరు కూడా కనీసం మీడియం రేంజ్ హీరోయిన్స్ అవ్వలేక పోయారు.
వేరే భాష కు వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకుంటున్నారు. అదే పరిస్థితి బుల్లి తెర ఇండస్ట్రీలో కూడా ఉందని ఈ బిగ్ బాస్ బ్యూటీ మాటలను వింటూ ఉంటే అర్థం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View