అతిలోక సుందరి సోదరి ఏమయ్యారు?

Update: 2018-03-10 05:49 GMT
శ్రీదేవి మరణం ఇంకా కొన్ని సమాధానం లేని ప్రశ్నలను అలాగే మిగిల్చి వెళ్లిపోయింది. బాత్ టబ్ లో ఊపిరాగి చనిపోవడం మొదలుకొని తన వ్యక్తిగత జీవితం గురించి మీడియా తమకు తోచిన రీతిలో కథనాలు ప్రసారం చేయటం చివరికి కపూర్ కుటుంబం దయచేసి ఇలా చేయకండి అని రిక్వెస్ట్ చేసే దాకా వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే శ్రీదేవి విషయంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో ఎక్కడా శ్రీదేవి స్వంత చెల్లెలు శ్రీలత జాడ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. శ్రీదేవి కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్ళలో పదిహేనేళ్ళు అక్క వెంటే ఉన్న శ్రీలత తన ప్రేమ వివాహం అయ్యాక అక్కకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం అమ్మకు, శ్రీదేవికి తన కాబోయే భర్త నచ్చకపోవడమే. చాలా కాలం ఇద్దరు కలిసి మాట్లాడుకునే సందర్భం కూడా రాలేదట.

1993 దాకా మంచి అనుబంధం కొనసాగించిన శ్రీదేవి-శ్రీలత అమ్మానాన్న ఒకరి తరువాత ఒకరు కాలం చేసాక విడిపోయారు. సుమారు పదేళ్ళ క్రితం తిరిగి కలుసుకున్న ఈ అక్కా చెల్లెళ్ళు అప్పటి నుంచి టచ్ లోనే ఉన్నారు. శ్రీదేవి దుబాయ్ పెళ్ళికి వెళ్ళాక అదే పనిగా శ్రీలతను కలవాలనుందని చెప్పి అక్కడికి రప్పించుకుందట. శ్రీదేవి చివరి ఘడియల్లో పక్కనే ఉన్నవాళ్ళలో శ్రీలత కూడా ఉన్నారని సమాచారం. బోనీ కపూర్ వచ్చాక శ్రీలత తన రూమ్ కు వెళ్ళిపోయిందని ఆ తర్వాతే ఈ ఘోరం చోటు చేసుకుందని ఇన్ సైడ్ టాక్. కాని ముంబై అంత్యక్రియల్లో శ్రీలత జాడ లేదు. ఆమె భర్త సతీష్ కూడా కనిపించలేదు. కారణం కపూర్ ఫ్యామిలీ అభ్యర్తనే అని తెలిసింది. మీడియాకు కనిపించకుండా ఈ జాగ్రత్త వహించినట్టు తెలిసింది. చెన్నైలో శ్రీదేవి పేరిట ఉన్న ఆస్తిని ఆ దంపతుల పేరిట బోనీ రాయబోతున్నట్టు టాక్.

ఇక శ్రీదేవి మరణం విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదని మినిస్ట్రీ అఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ స్పోక్స్ పర్సన్ రావీష్ కుమార్ స్పష్టం చేసారు. దుబాయ్ ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా సమాచారం అందుకున్నాకే ఆమె మరణంలో ఎటువంటి అసహజత లేదని నిర్ధారణకు వచ్చామని, ఇకపై ఎటువంటి అనుమానాలకు తావు లేదని తేల్చి చెప్పారు. ఇక్కడి పోలీసుల విచారణ అవసరం లేదని తేల్చేసారు.
Tags:    

Similar News