శ్రీ‌దేవి డెత్ వెనుక మిస్ట‌రీ ఉంది:మాజీ పోలీస్ అధికారి!

Update: 2018-05-18 07:04 GMT
ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 24న `అతిలోక సుంద‌రి`, ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి మ‌ర‌ణం పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం కాగా.....చివ‌ర‌కు ఆమె బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోయిన‌ట్లు దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక‌లో వెల్ల‌డించారు. ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం కాదని.....బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోవ‌డం ఎలా సాధ్య‌మ‌ని ....తెలుగు మీడియాతో పాటు....ప‌లు జాతీయ అంత‌ర్జాతీయ మీడియాల్లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. శ్రీ‌దేవి మ‌ర‌ణం వెనుకు బోనీక‌పూర్ హ‌స్త‌ముంద‌ని సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. మ‌రోవైపు, దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన నివేదిక‌ను బ‌ట్టి శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణ‌మేన‌ని భార‌త విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ కూడా ధృవీక‌రించ‌డంతో ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింది. శ్రీ‌దేవి మ‌ర‌ణం వెనుక ఉన్న క‌థ‌ల‌న్నీ క‌ట్టుక‌థ‌లుగా మిగిలిపోయాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా, శ్రీ‌దేవి మృతిపై ఓ మాజీ పోలీసు ఉన్న‌తాధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమెది స‌హ‌జ‌మ‌ర‌ణం కాద‌ని...ప‌క్క ప్ర‌ణాళిక ప్ర‌కారం హ‌త్య చేశారిన సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేశారు. ఓ ప్ర‌ముఖ ఇంగ్లిషు దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనేక ఆస‌క్తిక‌రి విష‌యాలు వెల్ల‌డించారు.

ఢిల్లీకి చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ క‌మిష‌ర్ ఆఫ్ పోలీస్ వేద్ భూష‌ణ్ ఓ ప్రైవేటు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని న‌డుపుతున్నారు. శ్రీ‌దేవి ప్రమాద‌వ‌శాత్తు బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోలేద‌ని, ప్ర‌ణాళిక ప్ర‌కారం ఆమెను హ‌త్య చేశార‌ని భూష‌ణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాత్ ట‌బ్ లో ఒక‌రిని బ‌లవంతంగా ముంచేసి, ఊపిరాడ‌కుండా చేసి చ‌నిపోయేలా చేయ‌డం చాలా సులువ‌ని ఆయ‌న అన్నారు. ఏ ఆధారాలు లేకుండా ఆ హ‌త్య‌ను స‌హ‌జ‌మ‌ర‌ణంగా చిత్రీక‌రించ‌డం అంత‌క‌న్నా సులువ‌ని చెప్పారు. శ్రీ‌దేవి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక‌లో ప‌లు అనుమానాలున్నాయ‌ని, చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొర‌క‌డం లేద‌ని అన్నారు. తాను దుబాయ్ లో శ్రీ‌దేవి బ‌స చేసిన హోట‌ల్ గ‌దికి కూడా వెళ్లాన‌ని అయితే ఆమె గ‌దిలో దిగేందుకు అనుమ‌తి ల‌భించ‌లేద‌ని చెప్పారు. అయితే, ఆమె బ‌స చేసిన గ‌దికి ప‌క్కన ఉన్న మరో గ‌దిలో తాను బ‌స చేసి ....ఆ బాత్ టబ్ సీన్ ను రీక్రియేట్ చేశాన‌ని అన్నారు. ఆ రూమ్ లో బాత్ ట‌బ్ లో ప‌డి చ‌నిపోవ‌డం అసాధ్య‌మ‌ని, లాజిక‌ల్ గా జ‌రిగే చాన్స్ లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. శ్రీ‌దేవి మ‌ర‌ణం వెనుక ఏదో తెలియ‌ని మిస్ట‌రీ ఉంద‌ని ఆయన చెప్పారు. మ‌రి, భూష‌ణ్ ఆరోప‌ణ‌లను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంటుందా? లేదా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.
Tags:    

Similar News