వసంత కోకిల లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈసారి అంగుళీయకము లేకున్నా ఆమెకు స్వర్గద్వార ప్రవేశము లభించింది. మన చాందినీ నింగికి చేరిపోయింది. ఆమె మరణం ఇప్పటికీ సినీ జనాలకు నమ్మలేని నిజం. అసలు అలా ఎలా జరిగింది.. అంటూ ఇప్పటికే తెలుగు వారి వీధివీధిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఇది నిజం... నమ్మితీరాలి.... మన శ్రీదేవి ఇక మనతో లేదు. ఆమె కార్డియాక్ అరెస్టుతో దుబాయ్ లో మరణించినట్టు చెప్పారు. తాజాగా ఆమె మరణం గురించి మరో విషయం బయటికొచ్చింది. అదే ఫోరెన్సిక్ రిపోర్ట్ విచిత్రం.
శ్రీదేవి ఎందుకు మరణించిందో పోస్టు మార్టం రిపోర్టు తేల్చేసింది. ఫోరెన్సిక్ రిపోర్టు ఇచ్చిన నివేదిక అక్కడి పోలీసుల చేతికి వచ్చేసింది. ఆ నివేదిక ప్రకారం... బాత్ టబ్ లోనే పడిపోవడం వల్ల నీరంతా శరీరంలోకి చేరడం - ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయిందని చెబుతోంది 'యాక్సిడెంటల్ డ్రౌనింగ్' అని పోస్టుమార్టమ్ రిపోర్టులో చెప్పారు. అందుకే ఆమె శరీరం కూడా ఉబ్బిపోయిందని నివేదికలో ఉంది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయింది అని డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారంట. అలా కాకుండా కింద నేలపై పడి ఉంటే... పరిస్థితి మరోలా ఉండేదేమో.
అయితే ఇప్పుడు ఎమిరేట్స్ పోలీసులు ఆమె బాడీ లో ఆల్కహాల్ వున్నట్లుగా గుర్తించారు! ఆమె అసలు యాక్సిడెంటల్ గా టబ్బులో ఎందుకు పడిపోయింది? మధ్యపానం ఎక్కువగా చేయడం వలనేనా? ఒకవేళ చేస్తే ఆమె పబ్లిక్ లో ఎక్కడైనా తాగిందా? లేదంటే ఆ పార్టీలో సరఫరా కాబడని మద్యం అంతా లీగల్ మధ్యమేనా? అసలు ఆ సమయంలో శ్రీదేవితో ఎవరున్నారు? ఇటువంటివన్నీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారట. కాని అత్యంత విచారకరమైన ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే మాత్రం.. శ్రీదేవి బాడీ ఇప్పుడప్పుడే పంపరు. ఎంబాల్మింగ్ చేసి దాచి పెడతారు. మొత్తం విచారణ పూర్తయ్యాకనే దేహాన్ని కపూర్ ఫ్యామిలీకి అప్పగిస్తారు.