యాభైల్లోకి పడ్డాక అతిలోక సుందరి ట్యాగ్ లైన్ తో పిలించుకునే అదృష్టం చాలా కొద్దిమందికే లభిస్తుంది. ఆ అదృష్టం శ్రీదేవి సొంతం. లాంగ్ గ్యాప్ తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ తో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. ఐదేళ్ల గ్యాప్ తీసుకొని తన 300 ల్యాండ్ మార్క్ మూవీగా మామ్ చేశారు.
తాజాగా ఆ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు మంచి కలెక్షన్లే లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రీదేవి కంట కన్నీరు కారిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇంతకూ లైవ్ లో శ్రీదేవి కన్నీరు పెట్టటానికి కారణం.. మూవీ ప్రమోషన్లో భాగంగా సినిమా తన కుమార్తెగా నటించిన పాక్ నటి సాజల్ అలీ లేకపోవటమేనట. ఈ సినిమాలో శ్రీదేవితో పోటాపోటీగా నటించి మంచి మార్కులు కొట్టేసిన సాజల్ తో తనకు మంచి బంధం ఉందని చెప్పుకొచ్చారు. షూటింగ్ సందర్భంగా తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని.. తన ఇద్దరు కూతుళ్లతో పాటు.. సాజిల్ కూడా తనకు మరో కూతురిగా మారిందన్నారు. ప్రమోషన్ సందర్భంగా తాను లేకపోవటం నిజంగా లోటేనంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తాను ఎందుకింత ఉద్వేగానికి గురి అవుతున్నానో తనకు అర్థం కావటం లేదని.. సాజల్.. అద్నాన్ లేకుండా ఇంత మంచి సినిమా సాధ్యమయ్యేదే కాదన్న శ్రీదేవి.. సినిమాకు మంచి పేరు వస్తున్న వేళ.. తనతో వారు లేకపోవటం బాధగా ఉందన్నారు.
Full View