రాజమౌళి నన్ను బాధించాడు -శ్రీదేవి

Update: 2017-06-25 04:02 GMT
బాహుబలి సినిమా విడుదలైంది చరిత్రలో గొప్ప విజయంగా మిగిలిపోయింది. అయితే బాహుబలి 2 విడుదల టైములో కొన్ని పుకారులు పుట్టుకువచ్చాయి. శివగామిగా  ముందు శ్రీదేవిని అనుకున్నారుని శ్రీదేవి అడిగిన డిమాండ్స్ ను తట్టుకోలేక ప్రొడ్యూసర్స్ రమ్యకృష్ణ ను తీసుకున్నారనేది రూమర్. ఇది రూమర్ కాదంటూ.. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి కూడా శ్రీదేవి గొంతమ్మ కోరికలు అడగటం వలనే ఆమెను తీసుకోలేదు అని చెప్పాడు. ఈ మొత్తం యవ్వారంపై ఇప్పుడు శ్రీదేవి ఏమంటోందంటే...

అప్పట్లో రాజమౌళి మాట్లాడుతూ.. “శ్రీదేవి ఈ సినిమా కోసం 8 కోట్లు అడిగింది. అది మాత్రమే కాకుండా రానూ పోనూ బిజినెస్ క్లాస్ టికెట్లు కావాలి అని చెప్పిందిని, హైదరాబాద్ కి వచ్చినప్పుడు స్టార్ హోటల్ లో తనతో పాటే ఉండటానికి మొత్తం ఐదు సూట్ రూమ్స్ అడిగింది. ఇవి కాకుండా హింది వర్షన్ ఫిల్మ్ షేర్లు కూడా అడిగింది'' అని చెప్పాడు. ఇది రాజమౌళి వర్షన్. ఇక మామ్ సినిమా ప్రమోషన్ కు  శ్రీదేవి హైదరాబాద్ వచ్చింది కానీ ఎక్కడుకు వెళ్ళినా సినిమా గురించి కన్నా ఆమె వద్దు అనుకున్న శివగామి గురించి పదే పదే అడిగేసారికి మొత్తానికి నోరు విప్పింది.

ఆమె మాటలలో... “నేను ఎక్కడు వెళ్ళిన ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో అర్ధంకావటంలేదు. నేను గతంలో చాలా సినిమాలు వదిలేశాను. నా వరకు వచ్చి నేను చేయని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అప్పుడు ఏ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇలా చేయలేదు. ఈ పాత్రను నేను కొన్ని కారణాలు వలన చేయలేకపోయాను అలా అని నేను ఏమి రాజమౌళి చెప్పినట్లు అటువంటి కోరికలు కోరలేదు. ఫ్లయిట్ టిక్కెట్లు.. రూములు.. షేర్లు.. అవన్నీ ఏమి డిమాండ్ చేయలేదు. అలా అడితే నాకు 300 సినిమాలు ఎవ్వరూ ఇచ్చుండరు. రాఘవేంద్రరావు గారు 24 సినిమాలు నాతో చేయరు. ఇక బోనీ కపూర్ కూడా అలా అడిగి ఉండరు. ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కాబట్టి..  సినిమా కష్టాలు ఏంటో తెలుసు. మరి రాజమౌళి కి ఎవరో తప్పుగా నా మాటలు చెప్పి ఉంటారు. కానీ ఒక సినిమాను నేను చేయాలి అనుకోవడం చేయను అనుకోవడం నా సొంత ఇష్టం నాకు ఆ హక్కు ఉంది. కానీ ఒక నటి నటుడు ఎందుకు చేయలేదో మీడియా ముందు అలా చెప్పడం రాజమౌళికి భావ్యం కాదు. అయినాసరే ఆయనంటే నాకు గౌరవం. నాకు రాజమౌళి సినిమాలు చాలా ఇష్టం ఆయన డైరెక్ట్ చేసిన ‘ఈగ’ చూశాను చాలా బాగా నచ్చింది. అతను ఎప్పుడు ఇలానే మంచి సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలిని నేను కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది శ్రీదేవి.

అయితే నిజానికి.. శ్రీదేవి మీద ఎవరు ఏ చిన్న మాటన్నా కూడా.. లీగల్ యాక్షన్ అంటూ కోర్టు నోటీసులతో విరుచుకుపడటం.. అటు శ్రీదేవికి ఇటు బోనీ కపూర్ కు బాగానే అలవాటు. అటువంటప్పుడు శ్రీదేవి ఇంతవరకు రాజమౌళి మాటలపై లీగల్ యాక్షన్ అనేది తీసుకోకపోవడం.. అలాంటి వార్నింగులు కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే.. రెండు విషయాలు అర్ధంచేసుకోవచ్చు. బాహుబలి డైరక్టర్ తో పెట్టుకుంటే.. అక్కడ కరణ్‌ జోహార్ తో రిలేషన్ చెడిపోవచ్చు. లేదంటే శ్రీదేవి నిజంగానే అలాంటి డిమాండ్స్ చేసుండొచ్చు. ఇంతకముందు ఆమె 'పులి' సినిమా విషయంలో కూడా అవే డిమాండ్స్ చేసిందని అప్పట్లో ఆ నిర్మాతలు కూడా కంప్లయింట్ ఇచ్చారు. హిందీ రైట్స్ ఇవ్వలేదని వారిపై కోర్టు కేసు కూడా వేసింది అమ్మడు.  
 ​
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News