సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఫిలిం సెలబ్రెటీల్లోనూ శ్రీదేవికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ మాత్రమే కాదు.. శ్రీదేవిని ఆరాధించిన టెక్నీషియన్లు.. నటీనటులకు లెక్కే లేదు. అందులో తాను కూడా ఒకడిని అంటున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. తన యవ్వనంలో శ్రీదేవిని ఆరాధించానని అతను చెప్పాడు. అప్పట్లో తన లాంటి కుర్రకారు అందరికీ శ్రీదేవి దేవతే అని సుకుమార్ చెప్పాడు.
శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాలు తాను చూశానని.. ఐతే అన్నింట్లోకి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అంటే తనకు చాలా చాలా ఇష్టమని సుకుమార్ చెప్పాడు. శ్రీదేవి సినిమాల్లో తాను ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే అని అన్నాడు. ఆ సినిమా రిలీజైన టైంలో ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు.. వరదలని.. అలాంటి సమయంలో వర్షం మధ్యే థియేటరుకు వెళ్లి సినిమా చూశామని.. ఐతే శ్రీదేవిని చూశాక చలి గిలీ ఏమీ లేకపోయిందని సుకుమార్ తెలిపాడు.
తాను శ్రీదేవిని ఒక్కసారి కూడా కలవలేదని.. కానీ ఆమె పరోక్షంలో తన ఒరిజినల్ వాయిస్ వినే అవకాశం వచ్చిందని సుకుమార్ చెప్పాడు. తాను కొంత కాలం కిందట శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను కలిశానని.. ఆ సమయంలోనే శ్రీదేవి ఫోన్ చేసిందని.. ఆమె వాయిస్ బయటికి వినిపిస్తుండటంతో తాను బయటికి వెళ్లనా అని బోనీని అడిగితే అవసరం లేదని చెప్పాడని.. తాను వేరే పనిలో ఉన్నప్పటికీ తన ధ్యాస మొత్తం శ్రీదేవి వాయిస్ మీదే నిలిచిందని.. ఆమె పట్ల తనకు అంత ఆసక్తి అని సుకుమార్ చెప్పాడు. ఇంత త్వరగా శ్రీదేవి మృతి చెందడం బాధాకరమైన విషయమని అన్నాడు.