శ్రీదేవి జీవితం పంజరంలో పక్షిలా

Update: 2018-03-01 07:32 GMT
అతిలోక సుంద‌రి మ‌ర‌ణం ప్ర‌తీ ఒక్క‌ర్ని క‌లిచి వేస్తుంది. దుబాయ్ పెళ్లికి వెళ్లిన శ్రీదేవి జుమేరా ఎమిరేట్స్ హోట‌ల్ బాత్రూంలో క‌న్నుమూశారు.  దుబాయ్ చ‌ట్టాలకు అనుగుణంగా కేసును ద‌ర్యాప్తు చేసి మూడురోజుల త‌రువాత ఆమె భౌతిక కాయాన్ని అప్ప‌గించారు. అనంత‌రం దుబాయ్ నుంచి ముంబైకి తీసుకువ‌చ్చి ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.   

ఇదిలా ఉంటే  ఆమె జ‌న‌నం నుంచి మ‌ర‌ణం వ‌ర‌కు దుర్భుర జీవితాన్ని గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది.  ప్ర‌పంచాన్ని త‌న అందం - అభిన‌యంతో మంత్ర ముగ్ధుల్ని చేసిన శ్రీదేవి జీవితం నాణానికి ఒక‌వైపు మాత్ర‌మే . మ‌రి రెండో వైపు మాత్రం క‌ష్టాల క‌డ‌లిని ఈదుకుంటూ లోకం విడిచి వెళ్లారు. వంద‌ల కోట్ల ఆస్తి - ప‌ర‌పతి - అశేష అభిమానాన్ని చూర‌గొన్న ఆమె వెండి తెర జీవితం జిలుగుల మ‌యం కాగా ..ఆమె నిజ జీవితం ముళ్ల పాన్పు అని వ‌రుస‌కు  శ్రీదేవి పెద్ద‌నాన్న అయిన వేణుగోపాల్ రెడ్డి పూస‌గుచ్చిన‌ట్లు వివ‌రించారు.

రాజేశ్వ‌రి అయ్యంగార్  - అయ్య‌ప్ప‌న్ అయ్యంగార్ దంప‌తుల కూతురు శ్రీదేవి. తండ్రి రాజ‌కీయాల్లో బిజీగా ఉంటే శ్రీదేవికి మ‌హాన‌టిగా గుర్తింపు తెచ్చేలా ప్ర‌య‌త్నాలు చేసింది ఆమె త‌ల్లి రాజేశ్వ‌రీయే. శ్రీదేవి వాళ్ల అమ్మ రాజేశ్వ‌రి రెండు సినిమాల్లో సైడ్ యాక్ట‌ర్ గా చేసిందని, అలా త‌న కూతుర్ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన‌ట్లు శ్రీదేవి పెద్ద‌నాన్న‌ వేణుగోపాల్ రెడ్డి ఓ వెబ్ మీడియా ఇంట‌ర్వ్యూ లో తెలిపారు. అంతేకాదు శ్రీదేవి - బోనీక‌పూర్ ల వివాహంపై అనేక సంచ‌ల‌న విష‌యాల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

తొల‌త శ్రీదేవి త‌ల్లి రాజేశ్వ‌రి సినిమాల్లో యాక్ట్ చేసిన‌ట్లు ప్ర‌య‌త్నాలు చేశార‌ని - ఆ ప్ర‌య‌త్నాల్లో రెండు సినిమాల్లో సైడ్ యాక్ట‌ర్ గా చేసిన‌ట్లు తెలిపారు. ఆప్ప‌టి నుంచి రాజేశ్వ‌రికి శ్రీదేవిని సినిమాల్లో యాక్ట్ చేయించాలి, అలా చేస్తే జీవితం బాగుంటుంద‌ని అనుకున్నారు. అనుకున్న‌దే త‌డువుగా ఓ వైపు సినిమాల్లో ప్ర‌య‌త్నాలు మ‌రోవైపు శ్రీదేవి డైటింగ్ విష‌యంలో ఆమె త‌ల్లి చాలా కేర్ తీసుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు.  

అలా రాజేశ్వ‌రికి తెలిసిన‌, ఇండ‌స్ట్రీకి చెందిన రంగారావు అనే  వ్య‌క్తి ద్వారా శ్రీదేవి వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది.  మొద‌ట్లో అడ‌పా ద‌ప‌డా చిన్న చిన్న కార్య‌క్ట‌ర్లు చేసిన శ్రీదేవి 1970 లో కేవీ నంద‌న రావు డైర‌క్ష‌న్ లో కృష్ణ - విజ‌య నిర్మ‌ల హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన మానాన్న నిర్ధోషి అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో బేబీ శ్రీదేవిగా అడుగుపెట్టిన‌ట్లు చెప్పారు. అప్ప‌టి నుండి శ్రీదేవి వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌సరం లేకుండా  పోయింద‌ని అన్నారు.

అంతేకాదు సినిమాకోసం శ్రీదేవి త‌న ముక్కుకు మూడు స‌ర్జీరీలు చేయించుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు. సినిమాపై ఉన్న క‌మిట్మెంట్ తోనే స‌ర్జరీలు చేయించుకున్న‌ట్లు చెప్పారు. ఓవైపు సినిమాలు చేస్తూ శ్రీదేవి పుట్టిన రోజు ఆగ‌స్ట్ 13న తిరుమ‌ల వ‌చ్చి తన చుట్టాలంద‌ర్ని పిలుపించుకొని వారి క్షేమ స‌మాచారం తెలుసుకునేదని , అంత పెద్ద యాక్టర్ అయినా ఎక్క‌డా త‌న ద‌ర్పం చూపించ‌లేద‌ని , అంత‌టి మంచి మ‌న‌సున్న శ్రీదేవి క‌ష్టాలు అనుభవించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అంతే కాదు శ్రీదేవి పెళ్లికి ముందు జీవితం ఎలా ఉంది. పెళ్లిత‌రువాత శ్రీదేవి ఎలాంటి దుర్భుర జీవితాన్ని అనుభ‌వించిందో పూస‌గుచ్చిన‌ట్లు వివ‌రించారు.

అన్నీ ఇండ‌స్ట్రీల్లో స‌త్తా చాటుతున్న శ్రీదేవి హిందీ సినిమా  చేసే స‌మ‌యంలో శ్రీదేవి కోసం బోనీక‌పూర్ ప‌లుమార్లు ఇంటికి వ‌చ్చేవాడ‌ని, అప్ప‌టికే పెళ్లైన బోనీ త‌న ఇంటికి రావ‌డంపై ఆమె త‌ల్లి అభ్యంత‌రం వ్య‌క్తం చేసింద‌న్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రాజేశ్వ‌రికి అమెరికాలో ఆప‌రేష‌న్లు చేయించింద‌ని, ఆ స‌మ‌యంలోనే బోనీ క‌పూర్ - శ్రీదేవిల మ‌ధ్య సాన్నిహిత్యం మొదలైన‌ట్లు చెప్పారు. రాజేశ్వ‌రికి ఆప‌రేష‌న్ చేయించే స‌మ‌యంలో ప‌లుమార్లు బోనీ క‌పూర్ ఆస్ప‌త్రికి వ‌చ్చిన‌ట్లు , శ్రీదేవికి తోడుగా ఉన్న‌ట్లు తెలిపారు. అప్ప‌టి నుంచి వారి మ‌ధ్య సాన్ని హిత్యం పెరిగి పెళ్లికి దారితీసిన‌ట్లు సూచించారు.

 రాజేశ్వ‌రి  త‌ల‌కు ఓవైపు ఆప‌రేష‌న్ చేయాల్సి ..మ‌రోవైపు చేశార‌ని, దాంతో ఆమె కోమాలోకి వెళ్లింద‌ని అన్నారు. దీంతో ఆస్ప‌త్రిపై కోర్టులో దావా వేసిన శ్రీదేవి వ‌చ్చిన డ‌బ్బును త‌న చెల్లికి ఇచ్చిన‌ట్లు పున‌రుద్ఘాటించారు. అంతేకాని మీడియాలో శ్రీదేవికి - ఆమె చెల్లి శ్రీల‌త మధ్య ఆస్తిగొడ‌వ‌లు జ‌రిగాయ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజంలేద‌ని కొట్టిపారేశారు. అప్ప‌టికి ఇప్ప‌టికి శ్రీదేవి- శ్రీల‌త ఇద్ద‌రు బాగుండేవార‌ని స్ప‌స్టం చేశారు.  

త‌ల్లిమాట‌ను శ్రీదేవి జ‌వదాటేది కాదు. ఆమె మాటే శాస‌నంలా భావించిన శ్రీదేవి పెళ్లి విష‌యంలో ప‌ట్టుబ‌ట్టింద‌ని వెల్ల‌డించారు. దీంతో రాజేశ్వ‌రి పెళ్లికి  అయిష్టంగా పెళ్లికి ఒప్పుకుంద‌ని, ఆ పెళ్లికి తాను వెళ్లిన‌ట్లు వేణుగోపాల్ రెడ్డి పెళ్లినాటి విష‌యాల్ని ముందుంచారు.

శ్రీదేవి - బోనీ పెళ్లి జ‌రిగిన త‌రువాత ఆమె వైవాహిక జీవితంలో అనేక మార్పులు వ‌చ్చాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్ప‌టికే వ‌రుస సినిమా ప్లాపుల‌తో పీక‌ల్లోతు అప్పుల్లో ఉన్న నిర్మాత  - శ్రీదేవి భ‌ర్త బోనీక‌పూర్ కు అండ‌గా నిలిచిన‌ట్లు చెప్పారు. తాను సంపాదించిన ఆస్తుల్ని అన్నింటిని అమ్మి బోనీకి ఉన్న అప్పుల్ని తీర్చేసింద‌ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా బోనీ క‌పూర్ వ‌క్ర‌బుద్ధి పై మండిప‌డ్డారు.రెండో భార్య శ్రీదేవిని పెళ్లి చేసుకున్న త‌రువాత  కూడా బోనీ త‌న మొద‌టి భార్య‌తో స‌న్నిహితంగా ఉన్న‌ట్లు చెప్పారు. శ్రీదేవి ఆస్తుల్ని అమ్మీ బోనీ అప్పుల్ని తీరుస్తే మొద‌టి భార్య‌తో స‌న్నిహితంగా ఉండ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు పెళ్లి త‌రువాత కూడా కొన్ని సార్లు శ్రీదేవి ఆమె ప‌డుతున్న‌ క‌ష్టాల గురించి త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో చెప్పుకునేద‌ని బాధ‌పడేద‌ని - త‌న ఆస్తుల్ని మొద‌టి భార్య‌కు ఇస్తున్నార‌ని - ఇలాగే కొన‌సాగితే త‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏమైపోతుందోన‌ని త‌లుచుకొని కొన్ని సార్లు శ్రీదేవి క‌న్నీరు మున్నీరు అయిన‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌రిగా జీవితాంతం క‌ష్టంతోనే బ్ర‌తికింది. క‌ష్టంతోనే పోయింది. ప్రేక్ష‌కుల‌కోసం చిరున‌వ్వు చిందిస్తుందేమో కానీ ఆమె మ‌న‌సంతా విషాదం గూడు క‌ట్టుకొని ఉంద‌ని ముగించారు. .

Tags:    

Similar News