ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ ల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఉరి దాడుల తర్వాత.. ఇండియా పాక్ పై సర్జికల్ దాడులు నిర్వహించడంతో.. ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధం అని ప్రకటించినట్లయింది. ఈ పరిస్థితులు సినిమా సంబంధాలపై గట్టి దెబ్బే తీశాయి. పాక్ నటులు ఉన్న సినిమాలను ఇండియాలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామనే హెచ్చరికలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి.
కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన యే దిల్ హై ముష్కిల్.. షారుక్ ఖాన్ మూవీ రాయిస్ లు పాక్ నటుల కారణంగా ఇప్పటికే చిక్కుల్లో.. ఇప్పుడు శ్రీదేవి నటించిన మామ్ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. మామ్ లో ఇద్దరు పాకిస్తానీ నటులు ఉన్నారు. శ్రీదేవి భర్తగా అద్నాన్ సిద్ధిఖీ.. కూతురుగా సజల్ ఆలీ నిటస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయిన ఈమూవీ.. మూడో షెడ్యూల్ ముంబైలోనే మొదలు కావాల్సింది కానీ.. ప్రస్తుతం నవ నిర్మాణ్ సేన దెబ్బకి బ్రేక్ పడింది.
ఈ మూవీకి నిర్మాత స్వయంగా శ్రీదేవి భర్త బోనీకపూరే కావడంతో.. ఇప్పటికి సినిమాను హోల్డ్ లో పెట్టేసి సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే పెద్ద మొత్తంలో వెచ్చించడంతో.. వేరే నటులతో సినిమా మళ్లీ స్టార్ట్ చేయడం అసాధ్యం అంటున్నారు. పాకిస్తాన్ తుఫాన్ శ్రీదేవి సినిమానే కాదు.. కమర్షియల్ యాంగిల్ లో ఇంటిని కూడా తాకిందట.