ఏంటో శ్రీదేవి ఆరాటం.. ఓసారి చూడండి

Update: 2017-10-27 18:09 GMT
ఇండియాన్ సినిమా తెరపై కలర్ సినిమాలు అప్పుడప్పుడే వస్తోన్న సమయంలో శ్రీదేవి రాకతో ఆ తెరలకు ఇంకాస్త అందం వచ్చిందని సీనియర్ సినీ ప్రేక్షకులు ఇప్పటికి బల్ల గుద్ది చెబుతారు. ఆమె అందానికి ఫిదా అవ్వని నటుడు లేడు. ఈర్షపడని హీరోయిన్ లేదు. అందమనే దానికి నానార్థం లాగా శ్రీదేవి ని సినీ గేయ రచయితలు ఇప్పటికే పొగుడుతారు.

ఎదో ఒక సందర్భంలో లేటెస్ట్ హీరోయిన్స్ కి శ్రీదేవి లాంటి అందం అనే బిరుదులు కూడా ఇచ్చేస్తారు, మరి అంత గొప్ప గుర్తింపు పొందిన శ్రీదేవి అందం ఇపుడు చెదిరింది అని ఎవరైనా అంటే ఉదాహరణకు ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూపించాల్సిందే. కళ్లు మారలేదు. నవ్వు చెదరలేదు. సొగసరి శ్రీదేవి మళ్లీ పుట్టిందా అని ఆమె వస్త్రాలు గుర్తు చేస్తున్నాయి. అంతే కాకుండా ఆమె చూపులు మనసుతో చూడమంటున్నాయి.  కాని ఇదంతా కూడా మేకప్ మాయాజాలమే. అసలు అర్జెంటుగా వయస్సు తగ్గించుకుంటూ అలా గ్లామర్ ను ఆరబోయాల్సిన పనేం వచ్చింది శ్రీదేవి? ఎందుకీ ఆరాటం?

నిజానికి ఇప్పుడు శ్రీదేవి తన కూతుళ్లను లాంచ్ చేసే సమయంలో.. ఒక ప్రక్కన పబ్లిక్ ఈవెంట్లలో తన వయస్సును చూపించేస్తూ.. మరో ప్రక్కన ఇలా గ్లామరస్ ఫోటో షూట్లతో కన్ఫ్యూజ్ చేస్తోంది. ఆమె అభిమానులకు ఇలాంటి షూట్లు ఆనందం తెప్పించవచ్చు కాని.. ఈ వయస్సులో కూడా ఇలాంటి ఫోజులు ఎందుకు అని చాలామంది విసుక్కుంటున్నారు. అది శ్రీదేవి మాత్రం.. నా ఇష్టం అంటోంది.
Tags:    

Similar News