ఫోటో స్టోరి: ఫోటోషాప్ సుందరి

Update: 2017-06-20 04:13 GMT
‘అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో యాడ దాచినావురో’ అనే మాట  అందాల రాశి శ్రీదేవికి మాత్రమే సొంతం అన్నడం లో ఏమాత్రం సందేహలేదు. ఎందుకంటే పదహారేళ్ళ వయసు సినిమాలో పూసిన సిరిమల్లె పువ్వు ఇప్పటికీ అంతే పరిమళంతో వికసిస్తుంది అనేది ఆమె అభిమానుల ఫీలింగ్.

హీరోయిన్ కాబోతున్న కూతుర్లు ఉన్న ఈ అమ్మ ఇప్పటికీ అమ్మాయిలానే కనిపించి అందరిని నోరు వెల్లబెట్టేలాగా చేసిందంటున్నారు ఫ్యాన్స్. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ కోసం ఈ మధ్యనే ఒక ఫోటో షూట్ చేసింది. శ్రీదేవి తన లావణ్యం అంతా  ప్రదర్శించింది అతిలోక సుందరిని తలపించింది. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి.. శ్రీదేవిని ఇంత పాలిష్డ్ బ్యూటీగా చూపించడానికి ఏకంగా ఆమె మేకప్ మ్యాన్స్ ఎంత ప్రతిభ కనబరిచారో.. అంతకంటే ఎక్కువగా ఫోటోషాప్ డిజైనర్లు కష్టపడ్డారు. 50+ అయిన శ్రీదేవి ఇంకా యంగ్ గా కనిపించాలనే తాపత్రాయంతో.. అసలు వయస్సును ఇలా దాచుకోవడం.. ఆమె స్థాయికి తగినది కాదనేది ఫెమినస్టుల అభిప్రాయం.

ఇకపోతే ఇంగ్లిష్ వింగ్లీష్ తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి హిట్ కొట్టిన శ్రీదేవి మళ్ళీ తన కొత్త సినిమా ప్రమోషన్లు తో బిజీగా ఉంది. ‘మామ్’ అనే సీరియస్ ఫిల్మ్ తో మళ్ళీ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. జూలై 7న ఈ సినిమా విడుదలవ్వనుంది కాబట్టే.. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ రచ్చంతా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News