ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా.. మన అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూరండీ బాబూ. తన చిన్నతనంలో గుండు కొట్టించుకుని.. సంప్రదాయమైన దుస్తుల్లో ఎంత ముద్దుగా ఉంది కదూ. ముంబయిలో పుట్టిన అమ్మాయి ఇలా దక్షిణాది సంప్రదాయాలకు తగ్గట్లు కనిపించడం.. గుండు చేయించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడైతో శ్రీదేవి పూర్తిగా ముంబయి జీవితానికి అలవాటు పడిపోయింది కానీ.. అప్పటికి ఇంకా సౌత్ లక్షణాలు పోలేదని ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. ఇంతకీ ఇప్పుడీ ఫొటో ఎలా బయటికి వచ్చిందనేగా సందేహం?
నిన్న, మార్చి 6న జాన్వి పుట్టిన రోజు. 19వ ఏట అడుగుపెట్టిన తన పెద్ద కూతురికి శుభాకాంక్షలు చెబుతూ శ్రీదేవి ట్విట్టర్ లో ఈ ఫొటోను షేర్ చేసింది. తల్లీ కూతుళ్లు ఎందుకు దూర దూరంగా ఉన్నారో కానీ.. ‘ఐ మిస్ యు జాన్వి. హ్యాపీ బర్త్ డే’ అంటూ ఈ ఫొటో పెట్టి విషెస్ చెప్పింది శ్రీదేవి. మూణ్నాలుగేళ్ల ముందు నుంచే మీడియాలోకి వచ్చేసి హాట్ హాట్ అవతారాల్లో దర్శనమిస్తున్న జాన్వి.. ఈపాటికే హీరోయిన్ కావాల్సింది. శ్రీదేవి - బోనీల ఉద్దేశం కూడా అదే అనిపించింది కానీ.. మధ్యలో ఎందుకో ఆమె ఫ్యాషన్ వేషాలకు బ్రేక్ వేసి.. చదువు మీద దృష్టిపెట్టేలా చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమాల్లోకి తీసుకొద్దామని అనుకుంటున్నారో ఏమో మరి. ప్రస్తుతానికి జాన్వి బుద్ధిగా చదువుకుంటోంది.