మెగాడాటర్ 'శ్రీదేవి శోభన్‌బాబు'.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

Update: 2023-02-17 12:00 GMT
టాలీవుడ్​లో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ‌గా హీరోలే ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న తండ్రి చిరు, త‌మ్ముడు రామ్​ చరణ్ సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది కాలం క్రితం సినీ నిర్మాణంలోకి కూడా వ‌చ్చింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై భ‌ర్త విష్ణు ప్ర‌సాద్‌తో క‌లిసి వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది.

అయితే ఇప్పుడు వరకు సరైన హిట్ అందుకోలేదనే చెప్పాలి. అయినా యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సరైన స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె భ‌ర్త విష్ణుతో కలిసి నిర్మించిన చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. ఎప్పుడో నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 18న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో సంతోష్ శోభ‌న్ హీరోగా నటించగా.. గౌరి జి.కిష‌న్ హీరోయిన్​గా నటించింది. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌కుడిగా వ్యవహించారు. ఈ మూవీతో ఎలాగైనా హిట్​ కొట్టాలని సుస్మిత ఆశిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా సరైనా హిట్​ను అందుకుని కెరీర్​లో మరో మెట్టు ఎక్కుతుందో లేదో చూడాలి.

ఇకపోతే రీసెంట్​గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​ జరిగింది. ఇందులో సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. "మన జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలు పంచే నిజమైన భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందింది. అమ్మానాన్నలతో గడిపే క్షణాలు, స్నేహితులతో సరదాగా గడిపే సమయం, ప్రేమలో ఉన్నప్పుడు కలిగే అనుభూతులు ఇలా అన్నీ ఉంటాయి" అని అన్నారు.


కాగా, ఈ సినిమా విషయానికొస్తే.. ఇదొక విభిన్నమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో శోభన్‌బాబుగా సంతోష్‌ నటించగా.. శ్రీదేవి పాత్రలో గౌరి నటించింది. సంతోష్‌ ఎక్కువగా మాట్లాడే కుర్రాడిగా కనిపిస్తే.. గౌరి టెంపర్‌ ఉన్న అమ్మాయిగా కనిపించింది. విభిన్నమైన వ్యక్తిత్వాలున్న వారి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమ్రాన్‌ స్వరాలు సమకూర్చారు. శశిధర్‌ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరించగా.. సిద్ధార్థ్‌ రామస్వామి ఛాయాగ్రహణం అందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News