సుధీర్ బాబు 'శ్రీదేవి సోడా సెంటర్' మోషన్ పోస్టర్..!

Update: 2020-10-30 15:00 GMT
'పలాస 1978' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్.. హీరో సుధీర్ బాబుతో తదుపరి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఓ కరెంట్ స్తంభం పక్కన టేబుల్ పై గోళీసోడాలు - మల్లెపూలు - డెక‌రేష‌న్ లైట్స్‌ - కరెంట్ వైర్లు కనిపించేలా పోస్టర్ వదిలి మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ చిత్రానికి ''శ్రీదేవి సోడా సెంటర్'' అనే టైటిల్ ని ఖరారు చేశారు. 'మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది' అంటూ సుధీర్ బాబు ''శ్రీదేవి సోడా సెంటర్'' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాడు.

'శ్రీదేవి సోడా సెంటర్' మోషన్ పోస్టర్ తోనే ప‌ల్లెటూరు నేప‌థ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది. పల్లెటూర్లలో జరిగే తిరునాళ్ళు(జాతర) నేపథ్యాన్ని చూపిస్తూ రంగులరాట్నం - తోలుబొమ్మలాట - ప్రభలను చూపిస్తూ 'శ్రీదేవి సోడా సెంటర్' ని చూపించారు. ఇందులో సుధీర్ బాబు మెడ మీద కర్చీఫ్ - భుజానికి డెక‌రేష‌న్ లైట్స్‌ తగిలించుకుని చేతిలో గోళీసోడా పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాయి. సుధీర్ బాబు ఈ సినిమాలో సూరిబాబు అనే పల్లెటూరి యువకుడి పాత్ర పోషిస్తున్నాడు. 'పలాస' సినిమాకు శ్రీకాకుళం నేపథ్యాన్ని ఎంచుకున్న కరుణ కుమార్.. ఈ సినిమా కోసం ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో చూడాలి. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. 'శ్రీదేవి సోడా సెంటర్' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Full View
Tags:    

Similar News